పవర్ డిసైడ్ చేసేది.. ఆ ఓటుబ్యాంకే ?

తెలంగాణలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly elections ) ఏ పార్టీ విజయం సాధించి అధికారాన్ని చేపడుతుంది.

ఏ ఏ పార్టీలు ప్రతిపక్షనికి పరిమితం అవుతాయి అనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఏదైనా ఒక పార్టీ విజయం సాధించాలంటే ఆ పార్టీకి రాజల్లో ఉండే బలంతో పాటు బరిలో నిలిచే అభ్యర్థుల పాత్ర కూడా చాలా ఉంటుంది.అలాగే కుల, మత ప్రతిపాధికన లభించే ఓట్లు కూడా పార్టీ విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి.

అందుకే కులాల ఆధారంగా రాజకీయ పార్టీలు అస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటూ ఉంటాయి.

సామాజిక వర్గాల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుపుతూ హామీలను ప్రకటిస్తూ ఉంటారు.అందులో భాగంగానే బి‌ఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్( BRS, BJP, Congress ) పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు బీసీ సామాజిక వర్గాన్నే ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఆ ఓటర్లకు గాలం వేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి.

Advertisement

అటు అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు.బీసీ ఓటర్లతో పాటు ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఓటర్లను కూడా గట్టిగానే టార్గెట్ చేస్తోంది.అయితే తెలంగాణలో దాదాపు 14శాతం ఉన్నమైనారిటీ ఓటర్లు ఏ పార్టీ వైపు నిలుస్తారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను మూడింట ఒక వంతు స్థానాల్లో ముస్లిం ఓటర్లే కీలకం కానున్నారు.

అందుకే ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న ఈ ఓటు బ్యాంకే కి రోల్ పోషించే అవకాశం ఉంది.ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలను గమనిస్తే మైనారిటీ ఓటర్లు అధికార బి‌ఆర్‌ఎస్ వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి.ఎందుకంటే ఏం ఐ ఏం తో బి‌ఆర్‌ఎస్ పొత్తు ఒక కారణం అయితే, మైనారిటీలకు కే‌సి‌ఆర్( kcr ) సర్కార్ అధిక ప్రదాన్యం ఇస్తూ వచ్చింది.

అందుకే ముస్లిం ఓటర్లు బి‌ఆర్‌ఎస్ పార్టీకే మద్దతు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.పైగా బీజేపీకి మైనారిటీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంది.అందువల్ల ఆ పార్టీకి మనారిటీల్లో ఒక్కశాతం ఓటు షేర్ కూడా లభించే అవకాశం లేదు.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?
లక్కీ భాస్కర్ : భిన్నమైన కథే కానీ, అందరి బుర్రకెక్కుతుందో లేదో చూడాలి!

ఇక కాంగ్రెస్ విషయానికొస్తే మనారిటీల విషయంలో స్పష్టమైన ఏజండాను కనబరచడం లేదు.ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే ముస్లిం ఓటర్లు బి‌ఆర్‌ఎస్ కే అండగా నిలిచే అవకాశం ఉండని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

మరి ఏం జరుగుతుందో చూడాలి.

తాజా వార్తలు