మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టే గసగసాలు.. ఇంతకీ వీటిని ఎలా వాడాలంటే!

గసగసాలు( Poppy Seeds ).వీటి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.

దాదాపు ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే దినుసుల్లో గసగసాలు కూడా ఒకటి.

ప్రధానంగా నాన్ వెజ్ వంటల్లో గసగసాలను ఉపయోగిస్తుంటారు.

చూడడానికి చిన్న పరిమాణంలో ఉన్న కూడా గసగసాల్లో మాత్రం కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ఎన్నో రకాల పోషకాలు మరియు ఔషధ గుణాలు నిండి ఉంటాయి.అందువల్ల ఆరోగ్యపరంగా గసగసాలు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి.

ముఖ్యంగా మోకాళ్ళ‌ నొప్పులతో బాధపడుతున్న వారికి గసగసాలు ఒక వరం అనే చెప్పుకోవచ్చు.

Poppy Seeds Helps To Get Rid Of Knee Pain Poppy Seeds, Knee Pain, Poppy Seeds M
Advertisement
Poppy Seeds Helps To Get Rid Of Knee Pain! Poppy Seeds, Knee Pain, Poppy Seeds M

ఎముకలు బలహీనంగా ఉన్నా, వయసు పైబడుతున్నా మోకాళ్ళ నొప్పులు వేధించడం చాలా సాధారణం.అయితే మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టే సత్తా గసగసాలకు ఉంది.ఇప్పుడు చెప్పబోయే విధంగా గసగసాలను తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు( Knee pains) దెబ్బకు పరార్ అవుతాయి.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గసగసాలు మరియు కొద్దిగా వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న గసగసాలు, మరియు 6 నుంచి 8 నైట్ అంతా నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పులు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Poppy Seeds Helps To Get Rid Of Knee Pain Poppy Seeds, Knee Pain, Poppy Seeds M

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక గ్లాస్ కాచి చల్లార్చిన పాలు వేసి మరోసారి గ్రైండ్ చేస్తే గసగసాల మిల్క్ సిద్ధం అవుతుంది.ఈ మిల్క్ ను ఒక గ్లాస్‌ చొప్పున నిత్యం తాగారంటే అద్భుతం ఫలితాలు పొందుతారు.గసగసాల్లో కాల్షియం, జింక్ మెండుగా ఉంటాయి.

అలాగే బాదంపప్పు, పాలు, ఖర్జూరంలో కూడా క్యాల్షియం రిచ్ గా ఉంటుంది.అందువల్ల రోజు ఒక గ్లాస్ గసగసాల పాలు తాగితే ఎముకలు దృఢంగా మారతాయి.

రక్తపు మరకల దుస్తులతోనే తండ్రికి కూతురు అంత్యక్రియలు.. వీడియో చూస్తే కన్నీళ్లాగవు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది.మోకాళ్ళ నొప్పులు పరార్ అవుతాయి.

Advertisement

మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి గసగసాల పాలు ఒక న్యాచురల్ మెడిసిన్ లా పనిచేస్తుంది.పైగా గసగసాల పాలు ఆరోగ్యమైన గుండెకు మద్దతు ఇస్తుంది.

శరీరంలో అధిక వేడిని తొలగిస్తుంది.కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా రక్షించే సత్తా గసగసాలకు ఉంది.

నిద్రలేమితో బాధపడుతున్న వారికి కూడా ఈ గ‌సగ‌సాల పాలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి.

తాజా వార్తలు