మంచి వాళ్ళని ఎందుకు గెలిపించడం లేదు అంటున్న పూనమ్ కౌర్

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ తాను నటించిన సినిమాల కంటే పవన్ కళ్యాణ్ ఇష్యూ కారణంగా ఎక్కువ ఫేమస్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండటంతో అతనిని టార్గెట్ చేయడానికి పూనమ్ కౌర్ ని ఇతర పార్టీ నేతలు భాగా ఉపయోగించుకున్నారు.

కొందరు ఆమె పేరుని వాడుకుంటే, మరికొందరు ఆమెతో ఇంటర్వ్యూలు నిర్వహించి ఆమె నోటి ద్వారా పవన్ కళ్యాణ్ ని తిట్టించి వ్యక్తిత్వాన్ని డామేజ్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని తగ్గించే ప్రయత్నం చేయాలని చూసారు.ఈ సమయంలో పూనమ్ కౌర్ భాగా పాపులర్ అయ్యారు.

Poonam Kour Tweet Viral In Social Media, Tollywood, AP Politics, Pawan Kalyan-�

ఆ తరువాత ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండటంతో మీడియా కూడా ప్రతి చిన్న విషయానికి ఈమెకి ప్రాధాన్యం ఇస్తూ వస్తుంది.అందుకు తగ్గట్లుగానే ఆమె సోషల్ మీడియాలో పెట్టె కామెంట్స్ ఎవరో ఒకరిని టార్గెట్ చేసే విధంగా ఉండేవి.

ఇదిలా ఉంటే తాజాగా ట్విట్టర్ లో ఆమె చేసిన వాఖ్యలు మరోసారి వైరల్ అయ్యాయి.అవినీతి గురించి కొందరు చెప్పిన అభిప్రాయాలు బాగానే ఉన్నాయని, అయితే, మనకందరికీ ఇన్ని విషయాలు తెలిసి కూడా అవినీతి రహితులకు ఎందుకు ఓట్లు వేయలేకపోతున్నామని పూనమ్ ఆవేదన వెలిబుచ్చారు.

Advertisement

"నాకు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి.ఏం, అవినీతి మచ్చలేని వ్యక్తులు మనకు నేతలుగా పనికిరారా? సమాధానం చెప్పండి.దేశం మొత్తాన్ని అడుగుతున్నాను.

అవినీతికి పాల్పడని నేతలను మనం ఎందుకు గెలిపించడంలేదు. మంచివాళ్లు రాజకీయాల్లో నెగ్గలేకపోతున్నారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అంటూ ట్విట్టర్ లో ఆమె స్పందించారు.

ఆమె పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించే ఈ ట్వీట్ చేసింది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

అందాన్ని పెంచే అర‌టి ఆకు.. ఎలా వాడాలో తెలుసా?
Advertisement

తాజా వార్తలు