వాల్తేరు వీరయ్య నుంచి మరో మాస్ సాంగ్ విడుదల.. మామూలుగా లేదుగా?

టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

రెండు తెలుగు రాష్ట్రాలలో మెగాస్టార్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.

బాగా చిరంజీవి ఇప్పటికీ ఈ వయసులో కూడా అదే ఊపుతూ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.

ఒక సినిమా విడుదల అవ్వకముందే మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు చిరంజీవి.ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఇక మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య.ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

Advertisement

చాలాకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న మాస్ మసాలా సినిమా ఇది.అంతేకాకుండా ఇందులో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి సంక్రాంతి పండుగను విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్ పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతున్నాయి.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి విడుదల అయిన బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వీరయ్య అనే పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.కాగా ఈ సినిమా నుంచి తాజాగా మరొక పాటను విడుదల చేశారు.మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా మరొక మాస సాంగ్ ని విడుదల చేశారు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాలు లోడింగ్ అనే పాటను విడుదల చేశారు.ఇక ఆ పాటలో మెగాస్టార్ అలాగే రవితేజ ఇద్దరు కలిసి స్టెప్పులను ఇరగదీశాడు.అంతే కాదండోయ్ ఆ పాటలోని మధ్య మధ్యలో చిరు రవితేజలు కూడా వారి గొంతును తెలిపారు.

Advertisement

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సాంగ్ యూట్యూబ్లో ట్రెండింగ్ అవడంతో పాటు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది.