మాజీ మంత్రి మరియు మాజీ తెలంగాణా పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెరాసలో చేరబోతున్నట్లు తాజా సమాచారం.
ఇదివరకే తెరాసలో చేరిన మాజీ పిసిసి అధ్యక్షులు డి.
శ్రీనివాస్, కె.కేశవ్ రావు ఈ విషయం గురించి ఆయనతో ఒక కాంట్రాక్టర్ ఫార్మ్ హౌస్ లో చర్చించినట్లు తెలుస్తోంది.ఆయన రాజ్యసభ సీటు కోరగా తెరాస ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
ఆయన కోడలు వైశాలికి మున్ముందు అసెంబ్లీ నుండి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని పొన్నాల కోరగా అందుకు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ అంగీకరించినట్లు తెలుస్తోంది.కనుక త్వరలోనే పొన్నాల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరే అవకాశాలున్నాయి.
అయితే పొన్నాల మీడియాలో వస్తున్న ఈ వార్తలను ఖండించారు.తనను పార్టీ మారే ఉద్దేశ్యం ఏదీ లేదని, కనుక పదవుల కోసం ఎవరితోనో బేరాలడుకోవలసిన అవసరం తనకు లేదని చెప్పారు.కానీ పార్టీలు మారదలచుకొన్న రాజకీయ నాయకులు అందరూ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేవరకు ఇదేవిధంగా ఖండిస్తుంటారు కనుక పొన్నాల కూడా అదే చేస్తున్నట్లు అనుమానించవలసివస్తోంది.మరికొన్ని రోజులు వేచి చూస్తే ఆయన పార్టీ మారుతారో లేదో ఎలాగూ తేలిపోతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy