పైసల్లేవ్ ! తులం బంగారం హామీపై మంత్రి పొంగులేటి

సూపర్ సిక్స్ పథకాలతో పాటు,  మరికొన్ని ఎన్నికల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ తరువాత పూర్తిగా ఆ హామీలను విస్మరించిందని పదేపదే విపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి ముఖ్యంగా ఈ విషయంలో బీఆర్ఎస్,  బీజేపీలు కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

నిన్ననే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేసారు.

లక్షలాది లగ్గాలు పెరికే మ్యారేజ్ సీజన్ మళ్ళా  వచ్చిందని , ఈసారి కూడా తులం బంగారం తూచ్ తూచేనా ?   అంటూ సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy)ని ఉద్దేశించి  కేటీఆర్ విమర్శలు చేశారు.  తాజాగా ఈ తులం బంగారం వ్యవహారంపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.

పైసల్ లేవ్ అందుకే తులం బంగారం ఇవ్వలేకపోతున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Ponguleti Srinivas Reddy Comments On Gold Scheme, Telangana Government, Telangan

 గత పది సంవత్సరాలుగా పాలించిన పార్టీ ,( బి ఆర్ ఎస్ ) కాకి గోల పెట్టినా,  ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivas Reddy )వెల్లడించారు .ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందని , ప్రతిపక్ష పార్టీలు వారి ఉనికిని కాపాడుకోవడానికి విమర్శలు చేస్తున్నారని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆడబిడ్డకు ఇచ్చిన మాట ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని మంత్రి అన్నారు.18 వేల కోట్లతో రెండు లక్షల రుణమాఫీ అమలు చేశామని పొంగులేటి గుర్తు చేశారు.ఇంకా 13వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం వెచ్చించాల్సి ఉందని,  భవిష్యత్తులో కూడా మీ దీవెనలతో వాటిని అమలు చేస్తామని పొంగులేటి అన్నారు.

Ponguleti Srinivas Reddy Comments On Gold Scheme, Telangana Government, Telangan
Advertisement
Ponguleti Srinivas Reddy Comments On Gold Scheme, Telangana Government, Telangan

ఖమ్మం జిల్లా( Khammam District )లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు.  ఈ నెలలో ప్రతి నియోజకవర్గంలో నాలుగు వేల ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని మంత్రి ప్రకటించారు.పీఎస్ఆర్ ట్రస్ట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థినిలకు సైకిళ్లు ఇస్తున్నామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు