హైదరాబాద్ గాంధీభవన్ వద్ద పోలీసుల మోహరింపు

హైదరాబాద్ లోని గాంధీభవన్ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు.కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీరుపై బజరంగ్ దళ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.ఇందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ కార్యాలయాల వద్ద హనుమాన్ చాలీసా చదవాలని పిలుపునిచ్చింది.

అదేవిధంగా గాంధీభవన్ ముట్టడికి పిలుపు నిచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?
Advertisement

తాజా వార్తలు