ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీవేన్స్ డే

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమిషనర్ విష్ణు యస్.

వారియర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీవేన్స్ డే కార్యక్రమం సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగింది.

వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ సమస్య గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.ఫిర్యాదులో అధికంగా భూ వివాదాలు, కుటుంబ , వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్ధిక లావాదేవీలు , భార్యభర్తల సమస్యలపై వచ్చిన బాధితుల ఫిర్యాదులను పరిశీలించారు.

ఫిర్యాదలపై క్షేత్రస్దాయిలో విచారణ జరిపి వాస్తవాలు పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకొవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల SHO అధికారులకు ఆదేశించారు.

బండి సంజయ్ తనయుడి వ్యవహారంపై స్పందించిన కల్వకుంట్ల కవిత
Advertisement

తాజా వార్తలు