పశ్చిమగోదావరి జిల్లాలో బైక్ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు... 52 బైక్లు రికవరీ

పశ్చిమగోదావరి జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగలను తాడేపల్లిగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం నిందితుల నుంచి 52 బైకులను స్వాధీనం చేసుకున్నారు.

సుమారు వీటి విలువ రూ.70 లక్షల వరకు ఉంటుందని జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ తెలిపారు.జల్సాలకు అలవాటు పడి జిల్లాలో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నట్లు తెలుస్తోంది.