హాస్పిటల్ లో ప్రధాని మోడీ తల్లి..!!

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది.

గుజరాత్ లో అహ్మదాబాద్ లో యుఎన్ మెహతా హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

ఇటీవలే  మోడీ తల్లి హీరాబెన్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది.ఆ సమయంలో ప్రధాని మోడీ తన తల్లి దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.

ఇదిలా ఉంటే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద మోడీ ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.ఈ ఘటనలో కుటుంబ సభ్యులకి స్వల్ప గాయాలయ్యాయి.

వారంతా సమీపంలో ఉన్న హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.కర్ణాటకలోని మైసూర్ లో ఈ ప్రమాదం జరిగింది.

Advertisement

అయితే ఈ ఘటనలో ప్రహ్లాద మోడీకి పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు స్పష్టం చేశారు.ఈ ఘటన జరిగీ 24 గంటలు గడవకముందే ఇప్పుడు ప్రధాని మోడీ తల్లి అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో జాయిన్ కావడం సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు