రేపు నిజామాబాద్ జిల్లాకు ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు.గిరిరాజ్ కళాశాలలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే అధికారిక కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు.

అనంతరం బీజేపీ ఏర్పాటు చేసిన ప్రజా గర్జన సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.మోదీ సభ నేపథ్యంలో సభా ప్రాంగణానికి సుమారు మూడు కిలోమీటర్ల వరకు పోలీసులు ఆంక్షలు విధించారు.

దాంతో పాటు రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.సభా స్థలి దగ్గర ఎస్పీజీ, కేంద్ర బలగాల నిఘా కొనసాగుతోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు