ఏపీ సీఎం వైఎస్ జగన్ కి బర్తడే విషెస్ తెలియజేసిన ప్రధాని మోడీ..!!

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి 50వ పుట్టినరోజు.ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు మరియు జగన్ అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

50వ జన్మదినోత్సవం సందర్భంగా చాలా ప్రతిష్టాత్మకంగా నాయకులు.తమ తమ నియోజకవర్గాలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు.

రక్తదాన శిబిరాలు, హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ మరియు మొక్కలు నాటడం స్కూల్ విద్యార్థులకు ఆటల పోటీలు ఇంకా అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు.ఈ క్రమంలో ట్విట్టర్ ద్వారా సీఎం జగన్ కి ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

సీఎం జగన్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ట్వీట్ చేయడం జరిగింది.ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులు.

Advertisement

ఇంకా తమిళనాడు ముఖ్యమంత్రి ఏంకే స్టాలిన్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైసీపీ పార్టీ కార్యాలయాల్లో కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తిరుపతి ఇందిరా మైదానంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలో ఇంకా విదేశాలలో సైతం భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు.

చేస్తున్నారు.

తాజా వార్తలు