ఘోర విమాన ప్రమాదం, 14 మంది మృతి

కజకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.టేకాఫ్ అయిన కొద్దీ క్షణాల్లోనే విమానం కుప్పకూలినట్లు తెలుస్తుంది.

ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.ఆల్ మటీ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన బేక్ ఎయిర్ విమానం విమానాశ్రయానికి సమీపంలో ఉన్న రెండు అంతస్తుల భవనాన్ని ఢీకొట్టడం తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.

Planecrash In Kazhakstan-ఘోర విమాన ప్రమాదం, 14 �

అయితే ఈ ప్రమాద సమయంలో విమానంలో 95 మంది ప్రయాణికులు,ఐదుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందగా,పలువురు తీవ్రంగా గాయపడడం తో సమీప ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.విమానం ఆల్‌మటీ ఎయిర్‌పోర్టు నుంచి కజకిస్థాన్‌ రాజధాని నూర్‌ సుల్తాన్‌కు బయల్దేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు నిర్ధారించారు.

Advertisement

విమానం కుప్పకూలిన స్థలానికి చేరుకున్న అధికారులు, పోలీసులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు.మరోపక్క ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.

స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, టైట్నింగ్ కు ఉపయోగపడే రెమెడీ ఇది.. డోంట్ మిస్!
Advertisement

తాజా వార్తలు