Vanga Geetha : పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత సంచలన వ్యాఖ్యలు..!!

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena chief Pawan Kalyan ) పిఠాపురంలో పోటీ చేస్తున్నట్లు ప్రకటన చేయటం జరిగింది.

ఈ ప్రకటనతో ఏపీలో సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంది.

అదే పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Constituency ) నుండి వైసీపీ తరపున వంగా గీత పోటీ చేయబోతున్నారు.ఈ సందర్భంగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ.

వంగా గీత సంచలన వ్యాఖ్యలు చేశారు.పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకి అవకాశం ఇవ్వటం పట్ల సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

కచ్చితంగా ఎన్నికలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషితో విజయం సాధిస్తానని పేర్కొన్నారు.రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో ప్రతి అభ్యర్థికి ప్రత్యర్థి అభ్యర్థులు ఉంటారు.

Advertisement

కానీ పిఠాపురం నియోజకవర్గం పై ఇప్పుడు అందరి దృష్టి ఏర్పడింది.పిఠాపురం హాట్ సీట్ అని అందరూ అంటున్నారు.

కానీ నా దృష్టిలో అది విన్నింగ్ సీట్ అంటూ వంగా గీత ( Vanga Geetha )వ్యాఖ్యానించారు.శక్తి మాత ఆశీస్సులతో సీఎం జగన్ మద్దతుతో ప్రజలు అందించబోయే దీవెనలతో వైసీపీ అభ్యర్థిగా పిఠాపురంలో విజయం సాధిస్తానని.స్పష్టం చేశారు.

పిఠాపురం నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాల నుండి తనకి అనుభందం ఉందని తెలిపారు.నియోజకవర్గంలో ప్రతి కుటుంబంతో ఓటర్లతో ప్రజలతో పరిచయాలు ఉన్నాయి.

వారి కుటుంబాలలో ఒక సభ్యురాలిగా నేను పెరిగాను.అందరూ నన్ను పిఠాపురం ఆడపడుచు అంటారు.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
Akkineni Nageswara Rao: అక్కినేని కి ఉన్న ఈ వీక్నెస్ గురించి ఎంత మందికి తెలుసు ?

ప్రస్తుతం నేను ఎంపీగా ఉన్నాను.నా పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడికి వెళ్లినా పిఠాపురం ఆడపడుచు అనే సంబోధిస్తారు.

Advertisement

పైగా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేశారు.కాబట్టి ప్రజల మద్దతు మాకే ఉంటుంది.

నియోజకవర్గం లో పర్యటించిన సమయంలో కూడా జగన్ పై ప్రజలకు ఎనలేని అభిమానం ఉంది.కాబట్టి పిఠాపురంలో వైసీపీ గెలవడం తధ్యమని వంగా గీత పేర్కొన్నారు.