నడిరోడ్డులో గుంత.. అందులో ఉప్పొంగిన వరద!

దేశ వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి.చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి.

నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.ఈ ప్రవాహ ఉద్ధృతికి జలాశయాలు నిండుకుండలా జలకళను సంతరించుకుంటున్నాయి.

చెరువులు, కుంటలు మత్తళ్లు దూకుతున్నాయి.భారీగా కురుస్తున్న వానలతో చాలా ప్రాంతాల్లో జన జీవనం స్తంభించిపోతోంది.

చాలా మంది వరద నీటిలో చిక్కుకుని విలవిల్లాడిపోతున్నారు.లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి.

Advertisement

వారాల తరబడి ఆ ప్రాంత వాసులు నీటిలోనే ఉండాల్సి వస్తోంది.వానల ఉద్ధృతికి చాలా ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి.

గుజరాత్ లోనూ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి.ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి.

నాలాలు ఉన్న ప్రాంతాల్లో నీటి ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉంది.ఆ సమీపంలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

అహ్మదాబాద్ రోడ్లు జోరు వానలకు జలమయం అయ్యాయి.అయితే అమరైవాడీ మెట్రో పిల్లర్ సమీపంలో రోడ్డు కుంగిపోయింది.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
వీడియో: గుర్రాన్ని గెలికిన బుడ్డోడు.. లాస్ట్ ట్విస్ట్ చూస్తే గుండె బద్దలు..

భారీ వరదల కారణంగా.రోడ్డు కొట్టుకుపోయింది.

Advertisement

రోడ్డు కింది భారీ గుంత ఏర్పడి రోడ్డుపైకి నీరు ప్రవహస్తోంది.ఈ భారీ గుంత మరింతగా విస్తరించే ప్రమాదం లేకపోలేదు.

అందుకే అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు.రోడ్డు మరింత డ్యామేజీ అయ్యే పరిస్థితి ఉండటంతో దాని దగ్గరికి ఎవరినీ వెళ్లనీయడం లేదు.

కొద్ది దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేశారు.రోడ్డుపై ఏర్పడ్డ భారీ గుంతనుచూసేందుకు స్థానికులు వస్తున్నారు.

ఇలా రోడ్డు కుంగిపోయి గుంత ఏర్పడటం వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.రోడ్ల నిర్మాణంలో నాసిరకం, నిర్లక్ష్యం, అధికారుల లెక్కలేనితనం ఈ వర్షాలతో బయట పడిందని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజా వార్తలు