రాత్రిపూట ల్యాండేటప్పుడు పైలెట్ వ్యూ ఎలా ఉంటుందో చూశారా...

విమానాల్లో ప్రయాణించేటప్పుడు చాలా భయమేస్తుంది.ముఖ్యంగా టేక్ ఆఫ్ ల్యాండింగ్ సమయాల్లో విమానం( Aeroplane ) కిందకి పైకి దూసుకెళ్తున్నప్పుడు వణుకు వస్తుంది.

ప్రయాణికులకే అలా ఉంటే చాలా పెద్ద వ్యూతో కిందకి పైకి పెద్ద విమానాన్ని తీసుకెళ్లే పైలెట్లకు( Pilots ) ఇంకా ఎంత భయం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.భయపడకుండా వారికి ట్రైనింగ్ ఇస్తారో ఏమో తెలియదు కానీ సామాన్యులు ఈ దృశ్యాలను చూస్తే కళ్ళు తేలయాల్సిందే.

ఇక చీకటిలో ఏమీ కనపడనప్పుడు ల్యాండింగ్ ప్లేస్ చూసుకొని దిగటం ఇంకా మరింత భయంగా అనిపిస్తుంది.రాత్రిపూట ల్యాండ్ అయ్యేటప్పుడు పైలెట్ వ్యూ ఎలా ఉంటుందో చూపించే వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో ఓపెన్ చేస్తే పైలెట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆకాశం కనిపిస్తుంది.ఫ్లైట్ అనేది మేఘాల పైన( Clouds ) వెళ్తున్నట్లుగా మనకి తెలుస్తుంది.కింద చీకటిగా అక్కడక్కడా లైట్లు కనిపిస్తుంటాయి.

Advertisement

తర్వాత విమానం మేఘాల కిందికి దూసుకొచ్చి షార్ప్ టర్నింగ్స్ తీసుకోవడం మొదలు పెట్టింది.అనంతరం తక్కువ హైట్ కి వస్తూ చివరికి ల్యాండింగ్( Landing ) ప్లేస్ లో ల్యాండ్ అయింది.31 సెకండ్ల పాటు సాగే ఈ వీడియో చూస్తున్నంత సేపు గుండె వేగం పెరుగుతుందని చెప్పుకోవచ్చు.

మామూలు వీడియో చూస్తుంటేనే ఇంత భయంస్తోంది అసలు పైలెట్లు దీన్ని ఎలా హ్యాంగిల్ చేస్తారో ఏమో అని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇలాంటి వీడియోలు ఎన్ని చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అని మరి కొందరు అంటున్నారు.ఈ వ్యూ సూపర్ గా ఉందని మరికొందరు పేర్కొంటున్నారు.

సైన్స్ గర్ల్‌ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసిన దీనికి ఇప్పటికే 1 కోటి 51 లక్షలు పైగా వ్యూస్ వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.

తమ గుంపును కాపాడుకోవడానికి ప్రాణ త్యాగం చేసిన అడవి దున్న.. అంతలోనే వెన్నుపోటు..?
Advertisement

తాజా వార్తలు