విమానం రోడ్డుపై దిగింది.. ఆశ్చర్యపోవడం వాహనదారుల వంతయ్యింది!

రోడ్డుపై వాహనాలు వెళ్తాయి.నడుచుకుంటూ వెళ్లే వారి దగ్గరి నుండి సైకిళ్లు, బైక్ లు, కార్లు, బస్సులు ఇలా చాలా వాహనాలు ఉంటాయి రోడ్లపైన.

కానీ విమానాలు ఉండటం మీరెప్పుడైనా చూశారు.మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు విమానం ల్యాండ్ అయితే ఎలా ఉంటుంది.

ఆశ్చర్యపోతారు కదా.అచ్చంగా అలాగే ఆశ్చర్యపోవడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయ్యారు అమెరికా నార్త్ కరోలినా లోని వాహనదారులు.అమెరికా నార్త్ కరోలినా.

అక్కడి స్వైన్ కౌంటీలోని విన్సెంట్ ఫ్రాజెర్. తన మామతో కలిసి విమానంలో వెళ్తున్నాడు.

Advertisement
Pilot Lands Plane On Highway Due To Issue In Engine Details, Flight Issues, Flig

కానీ అతనికి ఏదో తేడా కొట్టింది.ఇంజిన్ పని చేయడం లేదని గమనించాడు.

ముందుకు, వెనక్కు వెళ్లడం అసాధ్యమని అర్థం అయిపోయింది.విమానాన్ని కిందకు దించడం ఎలా, తమ ప్రాణాలను కాపాడుకోవడం ఎలా అని ఆలోచిస్తుండగా.

అతనికి ఓ ఆలోచన తట్టింది.రోడ్డుపైనే ల్యాండ్ కావాలని అనుకున్నాడు.

కానీ దాని కోసం పెద్ద హైవే కావాలి.అటు ఇటు చూడగా అతనికి ఒక హైవే కనిపించింది.

Pilot Lands Plane On Highway Due To Issue In Engine Details, Flight Issues, Flig
Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?

విన్సెంట్ అదృష్టం కొద్దీ ఆ హైవే ఎత్తుపల్లాలు లేకుండా ఉంది.దాంతీ అతను రోడ్డుపై విమానాన్ని ల్యాండ్ చేయాలని అనుకున్నాడు.రోడ్డుపైన వాహనాలను తప్పించాలని.

Advertisement

అలాగే రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్ల నుండి విమానా రెక్కలను తప్పించగలగాలి.అన్నీ లెక్కలు వేసుకున్న విన్సెంట్ తన ప్లేన్ ను జాగ్రత్తగా రోడ్డుపై ల్యాండ్ చేశాడు.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.ఈ దృశ్యాలన్నీ విమాన కాక్ పిట్ లోని కెమెరాలో రికార్డయ్యాయి.

తాజా వార్తలు