బోస్ వర్సెస్ వేణు: వై సి పి కి తలనొప్పిగా మారిన సమీకరణాలు ?

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం లో ఇప్పుడు వైసీపీ అధిష్టానానికి ఇబ్బందికర వాతావరణం ఏర్పడినట్లుగా తెలుస్తుంది.

ఈ నియోజకవర్గం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ మరియు చెల్లుబోయిన వేణు టికెట్ రగడ తారా స్థాయికి చేరినట్లుగా తెలుస్తుంది గతంలో రామచంద్రపురం( Ramachandrapuram Constituency ) అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ తరపున రెండుసార్లు పోటీపడి గెలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్( Pilli Subhash Chandra Bose ) తదనంతర పరిణామాలతో జగన్ వెంట నడిచారు .

కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్ వెంట నడిచిన తొలి తరం నేతల్లో ఒకరిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గుర్తింపు పొందారు.

ఆయనకు 2014లో రామచంద్రపురం టికెట్ ను వైసీపీ కేటాయించగా ఆయన అక్కడ గెలవలేకపోయారు.అయితే 2019లో బీసీ నేత అయిన చెల్లబోయిన వేణుకు( Chelluboina Venu ) రామచంద్రపురం అవకాశం ఇచ్చిన జగన్ పిల్లి సుభాష్ చంద్రబోస్ కు పక్కనే ఉన్న మండపేట నుంచి పోటీ చేయించారు.అయితే వేణు గెలిచి జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవిని దక్కించుకోగలిగారు .సుభాష్ చంద్రబోస్ మాత్రం వోటమి పాలయ్యారు .దాంతో మంత్రి వేణు హవా రామచంద్రపురం లో మొదలైనట్లుగా చెబుతారు.ఇది సుభాష్ చంద్రబోస్ వర్గానికి ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది.

ఏ విషయంలోనూ తమకు ప్రయారిటీ ఇవ్వకుండా వేణు అధికారం చలాయిస్తున్నారు అన్నది చంద్రబోస్ వర్గీయుల ప్రధాన ఆరోపణ.

Advertisement

రానున్న 2024 ఎన్నికలలో( AP 2024 Elections ) కూడా టికెట్ తనదే అన్నదే అన్న ధీమా వేణు లో కనిపించడం మండపేట నుంచి సుభాష్ చంద్రబోస్ పై గెలిచిన తోట త్రిమూర్తులు( Thota Trimurthulu ) వైసీపీ తీర్థం పుచ్చుకోవటంతో రెండు నియోజకవర్గాల లోనూ చంద్రబోస్ కి అవకాశం లేకుండా పోయింది .అయితే రామచంద్రపురం టికెట్ ఎట్టి పరిస్థితుల లోనూ తన కుమారుడికి 2024 ఎన్నికల్లో ఇవ్వాలని పట్టుబడుతున్న పిల్లి వర్గం ఆ దిశగా ఇప్పటికే అధిష్టానానికి విన్నవించుకున్నా సరైన హామీ దక్కలేదని తెలుస్తుంది.తన అనుచర వర్గంతో సమావేశమైన చంద్రబోస్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్గా నైనా ప్రోటీ చేయించాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది.

రామచంద్రపురం టికెట్ పై ఏర్పడిన వివాదాన్ని వైసీపీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి .

Advertisement

తాజా వార్తలు