బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఎలాటి సైకలాజికల్ సమస్యలు వస్తున్నాయో తెలుసా ?

మన అందరికీ తెలుసు బిగ్ బాస్ హౌస్ అంటే అక్కడ మూడు నెలల పాటు బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఉండాలి.

ప్రతి వారానికి ఒకరు ఎలిమినేట్ అయి బయటకు వెళ్తూ ఉంటారు.

కానీ చివరి వరకు ఖచ్చితంగా ఐదుగురు ఇంటి సభ్యులు ఉంటారు.రోజులు గడుస్తున్నా కొద్ది ఎలిమినేట్ అయ్యే వారి సంఖ్య పెరుగుతుంది.

చివరికి మిగిలేది ఒకరే అయినా కూడా ఎన్నో రోజుల ప్రయాణం ఒంటరిగా బిగ్ బాస్ హౌస్ లో బయట ప్రపంచానికి తెలియకుండా గడపాలి అంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది.బిగ్ బాస్ నియమాలకు అనుగుణంగానే అక్కడ ఉండాల్సి ఉంటుంది.

నిద్రపోతే కుక్కలు అరుస్తాయి, రూల్స్ పాటించకపోతే పనిష్మెంట్స్ ఉంటాయి, బయటకు మనం ఎలా ప్రొజెక్ట్ అవుతామో అనే ఒక టెన్షన్ ఉంటుంది.ఇన్ని పరిస్థితుల మధ్య ఐసోలేటెడ్ గా ఉన్న ఇంటి సభ్యుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు.

Advertisement
Phycological Issues After Elimination From Bigg Boss , Bigg Boss , Phycological,

కానీ ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అనేక మంది కంటెస్టెంట్స్ వారు సైకలాజికల్ గా ఎంతో బాధ గురి అయినట్టుగా వెల్లడిస్తూ ఉన్నారు.ఎందుకంటే బిగ్ బాస్ నిద్ర లేపినట్టుగానే ఎప్పుడూ భావిస్తూ ఉంటామని, నిద్రపోతే ఎక్కడ కుక్కలు అరుస్తాయోనే టెన్షన్ ఉంటుందని, అలాగే తమ ఎలా చూస్తారు అని భయం ఎల్లప్పుడూ ఉంటుందని ఏదైనా తప్పు చేస్తే సమాజం తనని తప్పుగా భావిస్తుందేమో అని ఒక అనుమానంతో ఎప్పుడూ అటెన్షన్ అవుతూ ఉంటామని దానివల్ల మెదడుపై ప్రెషర్ పడుతుందని చెప్తున్నారు.

Phycological Issues After Elimination From Bigg Boss , Bigg Boss , Phycological,

ఈ షో నుంచి బయటకు వచ్చాక కొన్నాళ్ల పాటు డిప్రెషన్ కి కూడా గురైన వారు ఉన్నారట.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినవారు.అలాగే హౌస్ లో మద్యం తాగడానికి కూడా అనుమతి లేదు.

అందువల్ల వారిలోని ఫ్రస్టేషన్ బయటకు వెళ్లదు.సిగరెట్ తాగడానికి అనుమతులు ఉన్నా కూడా అందరికీ ఆ అలవాటు ఉండదు.

కొన్నిసార్లు అయితే బయటకు వెళ్లడానికి కూడా భయమేస్తుందని, పబ్లిక్ తమని ఎలా చూస్తున్నారు అనే దానిపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి వస్తుందని చెప్తున్నారు.ఇక హౌస్ లో కూడా ఎప్పుడూ ఎవరో ఒకరు టార్గెట్ అవుతూ ఉంటారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

టార్గెట్ అయిన వారి మానసిక పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.అన్నిటికి మించి ఒంటరితనం అనుభవించాల్సి వస్తుంది.

Advertisement

ఆ ఒంటరి తనంలో ఒక్కోసారి పిచ్చి పడుతుంది ఏమో అని అనుమానం కూడా వస్తుందట.ఈ విషయాలన్నీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ చెప్పడం విశేషం.

తాజా వార్తలు