గబ్బిలాలు వేలాడే చెట్టుకు పూజలు చేస్తున్న ప్రజలు.. ఎందుకు అలా చేస్తున్నారంటే..?

సాధారణంగా గబ్బిలాలు( Bats ) అంటే చాలా మంది ప్రజలు భయపడుతూ ఉంటారు.అవి గ్రామాలలో సంచరిస్తే అరిష్టమని భావించేవారు ఎంతోమంది ఉన్నారు.

వాటి అరుపులు కూడా ఆపశకునం అని చాలామంది ప్రజలు భావిస్తారు.ఇక వింత చెట్టుకు ఎక్కడైనా ఎవరైనా పూజలు చేయడం మీరు ఎప్పుడూ చూసి ఉండరు.

కానీ ఈ గ్రామస్తులకు ఈ రెండు ఆరాధ్య దైవాలు అని స్థానిక ప్రజలు చెబుతున్నారు.గబ్బిలాల శబ్దాలు వారికి శుభ సూచకాలు.

చింత చెట్టు( Tamarind Tree )ను పూజిస్తే వారి చింతలన్నీ దూరమైపోతాయని విశ్వసిస్తున్నారు.ఈ వింత నమ్మకాల గ్రామం కడప జిల్లా( Kadapa District )లో ఉంది.

People Worshiping The Tree Where Bats Are Hanging.. Why Are They Doing That ,
Advertisement
People Worshiping The Tree Where Bats Are Hanging.. Why Are They Doing That ,

కడప జిల్లా( Kadapa District ) రైల్వే కోడూరు మండలంలోని మాధవరం పోడు అనే గ్రామంలో దాదాపు 450 కుటుంబాలు జీవిస్తున్నాయి.ఈ గ్రామం మధ్యలో ఒక పెద్ద చింత చెట్టు ఉంటుంది.దాని పైన పెద్ద సంఖ్యలో గబ్బిలాలు ఎప్పుడు చేసే శబ్దలతో ఆ గ్రామం అంతా కోలాహలంగా ఉంటుంది.

అదే తమ ఊరి అదృష్టం అని స్థానిక ప్రజలు చెబుతున్నారు.గబ్బిలాలు తన గ్రామానికి రావడం వల్ల గ్రామం సుభిక్షంగా ఉందని చెబుతున్నారు.గతంలో తమ ఊరిలో ఎప్పుడూ గొడవలు పోట్లాటలతో ప్రశాంతతే లేకుండా ఉండేదని ఈ గబ్బిలాలు వచ్చినప్పటి నుంచి తమ ఊరిలో గొడవలన్నీ దూరమైపోయాయని చెబుతున్నారు.

People Worshiping The Tree Where Bats Are Hanging.. Why Are They Doing That ,

అప్పటి నుంచి గ్రామంలో ప్రశాంతత ఉందని చెబుతున్నారు.అంతే కాకుండా తమ గ్రామంలో పంటలు కూడా బాగా పండుతున్నాయని చెబుతున్నారు.ఈ గబ్బిలాలకు ఎటువంటి హాని జరగకుండా గ్రామస్తులు రక్షణగా ఉంటారు.

అంతేకాకుండా సాక్షాత్తు దేవతలే ఆ గబ్బిలాల రూపంలో తమ గ్రామంలో కొలువు తీరారని నమ్ముతున్నారు.అలాగే నిత్యం పూజలు చేస్తున్నారు.

దర్శకుడిని ఓ రేంజిలో ఉతికారేసిన చంద్రమోహన్.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు..

అంతేకాకుండా గబ్బిలాల మలం తో పిల్లలకు స్నానం చేయిస్తారు.అలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు.

Advertisement

అయితే కోడూరు మండలానికి ( Koduru Mandala )చెందిన గంగు రాజు పోడు అనే మరో గ్రామస్తులు మాత్రం గతంలో ఆ గబ్బిలాలు తమ గ్రామంలోనే ఉండేవని గ్రామంలో వేటగాళ్లు గబ్బిలాలను చంపి తినడం వల్ల పక్క గ్రామానికి వెళ్లిపోయాయని చెబుతున్నారు.అప్పటి నుంచి తమ గ్రామంలో పంటలు లేవని గ్రామంలో అల్లర్లు పెరిగాయని కూడా చెబుతున్నారు.

తాజా వార్తలు