ఈ సమస్యలు ఉన్నవారు బీట్ రూట్ అస్సలు తినకూడదు..

బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంత మంచిదో అలాగే ఆరోగ్యానికి ఎంత ప్రయోజకరణంగా ఉంటుందో అందరికీ తెలిసిందే.

ఎందుకంటే బీట్ రూట్ లో విటమిన్ బి, విటమిన్ సి, ఫాస్ఫరస్, క్యాల్షియం, ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి బీట్ రూట్ తినమని సూచిస్తూ ఉంటారు.వీటిని తినడం వల్ల లాభాలు మాత్రమే కాకుండా దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

అయితే బీట్ రూట్ ని అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అయితే బీట్ రూట్ ని తినడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామంది ఈ మధ్యకాలంలో మధుమేహంతో బాధపడుతున్నారు.అయితే మధుమేహం వ్యాధితో బాధపడుతున్నవారు బీట్ రూట్ తినడం చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఎందుకంటే బీట్ రూట్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది.అందుకే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, అలాగే మధుమేహం వ్యాధితో బాధపడేవారు వీటిని తీసుకోకపోవడమే మంచిది అని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.రక్తపోటు సమస్యలు ఉన్నవారికి కూడా బీట్ రూట్ హాని కలిగించవచ్చు.

ఎందుకంటే ఇందులో నైట్రేట్ అధిక పరిమాణంలో ఉంటుంది.అందుకే రక్తపోటు ఉన్నవాళ్లు బీట్ రూట్ తింటే తీవ్రవ్యాధిగా మారచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు కూడా బీట్ రూట్ ను తినకపోవడమే మంచిది.ఎందుకంటే బీట్ రూట్ కిడ్నీ లో రాళ్లను పెంచడానికి దోహదపడుతుంది.అలాగే మూత్రపిండాల్లో కూడా రాళ్ల సమస్యలను పెంచుతుంది.

ఇక కాలేయ సమస్యలతో బాధపడుతున్న వాళ్లు కూడా బీట్ రూట్ కు దూరంగా ఉండటమే మంచిది.ఎందుకంటే బీట్ రూట్ జీర్ణక్రియ రేటును పెంచుతుంది.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?

దీనిని అతిగా తినడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.కాబట్టి కాలేయ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు బీట్ రూట్ తినకపోవడం మంచిది.

Advertisement

తాజా వార్తలు