తెలంగాణ అధికార ప్రతినిధులకు పీసీసీ షోకాజ్ నోటీసులు

పదకొండు మంది అధికార ప్రతినిధులకు పీసీసీ షోకాజ్ నోటీసులు అందజేసింది.

హైదరాబాద్ గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన అధికార ప్రతినిధులు, ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో 13 మంది అధికార ప్రతినిధులుండగా.నిన్నటి సమావేశానికి పదకొండు మంది అధికార ప్రతినిధులు గైర్హాజరైన సంగతి తెలిసిందే.

హాజరు కాకపోవడానికి గల కారణాలపై వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది.కాగా నిన్న నిర్వహించిన సమావేశానికి కేవలం ఇద్దరు అధికార ప్రతినిధులు మాత్రమే హాజరైయ్యారు.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement