ఒకవైపు చంద్రబాబు( Chandrababu ) అరెస్టు ,లోకేష్( Lokesh ) విచారణ వంటివి తెలుగుదేశం శ్రేణులను పట్టిపీడిస్తుండగా మరోవైపు ఎన్నికల కేంద్రంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాల వేగం తెలుగుదేశాన్ని కలవరపెడుతున్నట్లుగా తెలుస్తుంది.
ముఖ్యంగా అసలు బలమే లేని తెలంగాణలో 32 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయం తీసుకోవడం వెనక జనసేన వ్యూహం ఏమిటో మిత్రపక్షానికి అంతుపట్టడం లేనట్టుగా ఉంది.
అసలు బలమే లేని చోట 20 స్థానాల లో పోటీకి దింపుతున్న జనసేన, బలపడ్డామని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు ఆశిస్తుందో తెలియక ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు గుబులు చెందుతున్నారట.తెలంగాణ( Telangana ) లో పోటీ చేయబోతున్న లెక్క ప్రకారం చూసుకున్నా 20 శాతం సీట్లు అంటే కనీసం 50 సీట్ల వరకూ జనసేనకి ఇవ్వాల్సి వస్తుంది.
అంటే దాదాపు కీలక నేతలలో చాలామంది పొత్తుల్లో సీట్లు వదులుకోవాల్సి వస్తుంది.అదే ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తుకు ప్రధాన అడ్డంకి గా మారినట్లుగా తెలుస్తుంది.
అయితే ఇప్పుడు పవన్ మద్దతు లేకపోయినా కూడా తెలుగుదేశానికి ఎన్నికలు ఎదుర్కోవడం చాలా కష్టం తో కూడుకున్న వ్యవహారం.
కేంద్రం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు లేకపోవడం, విచారణలు అరెస్టులు అంటూ అధికారపక్షం పూర్తిగా పట్టుబిగుస్తుండడంతో ఇప్పుడు పవన్ మద్దతు తెలుగుదేశానికి ఆక్సిజన్ లా మారింది.అలాంటప్పుడు పొత్తు వ్యవహారాలలో మరీ పంతానికి పోతే అసలుకే మోసం వస్తుందన్న భయం కూడా తెలుగుదేశం వ్యహకర్తల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది.మరి కీలెరిగి వాత పెడుతున్నట్టుగా దూసుకెళ్తున్న పవన్ పూర్తి స్తాయి లౌక్యాన్ని ప్రదర్శిస్తున్నారు .పవన్ ధుకుడు చూస్తుంటే తాను అనుకున్న నెంబర్ను తెలుగుదేశం నుంచి సాధించేలాగే కనిపిస్తుంది.నిన్న మొన్నటి వరకు కేవలం పార్ట్ టైం పొలిటిషన్ గా కనిపించిన పవన్ ఇప్పుడు పూర్తిస్థాయి పరిణితి చెందిన నాయకుడిలాగా రూపాంతరం చెందారు.
ఎక్కడ తగ్గాలో ఎక్కడ పట్టు బిగించాలో జనసేనా ని అర్థం చేసుకున్నట్లే కనిపిస్తుంది.మరి పవన్ దూకుడు చూస్తుంటే తెలుగు తమ్ముళ్ళు త్యాగరాజులుగా మారక తప్పేటట్టు లేదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy