బాబుతో పవన్ భేటీ: ఇక గేర్ మారుస్తారా?

52 రోజుల జైలు జీవితం తర్వాత అ అనారోగ్య కారణాల తో మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబుని( Chandrababu ) జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )భేటీ అయ్యారు.

ఇప్పటికే రెండు పార్టీల పొత్తు సమన్వయ భేటీల స్థాయికి చేరుకుంది.

అయితే చంద్రబాబు రిలీజ్ అవ్వడంతో ఈ భేటీలకు కొంత విరామం ప్రకటించారు.ఇక చంద్రబాబు తో తేల్చుకోవాల్సిన విషయాలను పవన్ వేగవంతం చేస్తారని, ఇరు పార్టీల క్షేత్రస్థాయి పోరాటాలపై విస్తృతస్థాయి సమావేశం లో చర్చించాల్సిన విషయాలను ఈ ఇరు పార్టీల అధ్యక్షులు చర్చిస్తారని, పొత్తులకు అడ్డంగా ఉన్న పరిస్థితులను చర్చించుకొని పొత్తులను ఫైనల్ చేసుకుంటారని ఇకపై గేర్ మార్చి శ రవేగంగా ఎన్నికలకు సిద్ధమవటానికి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి .

Pawans Meeting With Babu: Will You Change Gears , Chandrababu ,pawan Kalyan

చంద్రబాబుపై మరి కొన్ని కేసులతో వైసిపి ( YCP )సర్కార్ రెడీ అవుతుండడం తో బాబు ఎంతకాలం బయట ఉంటారు అన్నది కూడా ప్రశ్నార్ధకం గా మారింది.దాంతో కోర్టు ఇచ్చిన గడువు లోపల పార్టీ నిర్మాణానికి, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన అంశాలను పూర్తి చేసుకోవాలనే తొందరలో ఇరు పార్టీల నాయకులు ఉన్నట్లుగా తెలుస్తుంది .

Pawans Meeting With Babu: Will You Change Gears , Chandrababu ,pawan Kalyan

అందుకే కీలకమైన విషయాలను చంద్రబాబుతో చర్చించి ఫైనల్ చేసేసుకుంటే మిగిలిన విషయాలను నెమ్మదిగా చూసుకోవచ్చు అని ముఖ్యంగా పొత్తుకు ఇబ్బందిగా ఉన్న అంశాలను , పీఠముడిగా మారిన సీట్ల లెక్కలను ఒక కొలిక్కి తీసుకొస్తే మిగిలిన ఫార్మాలిటీస్ ను లోకేష్ ( Nara Lokesh ) తో అయినా పూర్తి చేసుకోవచ్చనే ఆలోచనలో జనసేన( Janasena ) కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది.దాంతో చంద్రబాబు పవన్ ల భేటీ పూర్తిస్థాయి రాజకీయ భేటీ అని ఈ భేటీతో ఈ రెండు పార్టీల తదుపరి కార్యాచరణ పై స్పష్టమైన సంకేతాలు వస్తాయని ఇరు పార్టీల నేతలు ఆశిస్తున్నారు.మరి ఈ ఇద్దరు నేతల భేటీ తర్వాత ఈ జోడు పార్టీ ల వేగం పేరుగుతుందేమో చూడాలి .

Advertisement
Pawan's Meeting With Babu: Will You Change Gears , Chandrababu ,Pawan Kalyan
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

తాజా వార్తలు