మరోసారి పాట పాడబోతున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఏప్రిల్ లో వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు.వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ట్రెండ్ సృష్టించింది.

Pawan Will Sing A Song In Ak Remake, Music Director Thaman, Tollywood, Vakeel Sa

ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత కాలం నుంచో ఆయన్ని మరల తెరపై చూడాలని కోరుకుంటున్నారు.ఈ నేపధ్యంలో వకీల్ సాబ్ మీద భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది.

ఇక ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించారు.ఎంతో కాలం నుంచి పవన్ కళ్యాణ్ సినిమాకి సంగీతం అందించాలని అనుకుంటున్న తమన్ కి వకీల్ సాబ్ తో ఆ కల నెరవేరింది.

Advertisement

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తన సినిమాల కోసం అప్పుడప్పుడు గొంత సవరించుకొని గాయకుడుగా మారిపోతాడు.గతంలో చాలా సినిమాలకి పాటలు పాడాడు.

అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ పాడిన సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ నేపధ్యంలో సంగీత దర్శకులు పవన్ తో ఓ బిట్ సాంగ్ అయినా పాడించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా పవన్ తో ఓ పాట పాడించడానికి రెడీ అయ్యాడు.వకీల్ సాబ్ ప్రమోషన్ లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో అయ్యప్పన్ కోశియమ్ రీమేక్ తెరకెక్కుతుంది.ఈ చిత్రంలోనే పవన్ ఓ సాంగ్ ఆలపించబోతున్నట్లు థమన్ వెల్లడించారు.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు