బాబాయి, అబ్బాయి, త్రివిక్రమ్‌?

మెగా ఫ్యామిలీ హీరోలు పవన్‌, చరణ్‌ల కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న విషయం తెల్సిందే.పవన్‌ నిర్మాణ సంస్థలో చరణ్‌ నటించబోతున్నాడు.

ఆ సినిమా గురించి ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది.అయితే ఎవ్వరి దర్శకత్వంలో, ఎప్పుడు ఆ సినిమా ప్రారంభం అవుతుంది అనే విషయంలో మాత్రం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో రకరకాలుగా పుకార్లు వినిపిస్తున్నాడు.

తాజాగా పవన్‌, చరణ్‌ సినిమాకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.అందుకు కొన్ని ఉదాహరణలు కూడా వారు చెబుతున్నారు.

రామ్‌ చరణ్‌కు చాలా కాలంగా త్రివిక్రమ్‌తో కలిసి వర్క్‌ చేయాలని ఉంది.ఇక తనకు లైఫ్‌ ఇచ్చిన పవన్‌ స్థాపించిన నిర్మాణ సంస్థలో మొదటి సినిమాను తానే చేయాలనే కోరికతో త్రివిక్రమ్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

దాంతో ఈ కాంబినేషన్‌ వర్కౌట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.

ఈ ముగ్గురి కలయికలో సినిమా వస్తే సంచలనమే అవుతుందని సినీ విశ్లేషకులు సైతం అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు