పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి.. ఆళ్ల నాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి ఆళ్లనాని తీవ్రంగా మండిపడ్డారు.వాలంటీర్లపై పవన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.

వాలంటీర్లు సేవ చేస్తుంటే వారిపై ఆరోపణ చేస్తున్నారా అని ప్రశ్నించారు.సీఎంపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

పవన్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ నే పవన్ ఏలూరులో చదివారన్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆస్పత్రుల్లో నిధులు, సిబ్బంది కొరత ఉండేదని చెప్పారు.వైసీపీ పాలనలో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజ్ నిర్మిస్తుంటే ఆస్పత్రిపై అసత్య ప్రచారం చేయడం తగదని సూచించారు.ఈ క్రమంలోనే పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని తెలిపారు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021

తాజా వార్తలు