ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ రెండేళ్లు కష్టమే.. ఫ్యాన్స్ ఆందోళన!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ తన సినిమాలతో బిజీగా ఉన్నారు.ఈయన చేస్తున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దదిగా ఉంది.

కానీ రిలీజ్ డేట్ ల విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ ఏడాది వెండితెర మీద తమ స్టార్ హీరోను చూస్తామో లేదో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ తన మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు తో బిజీగా ఉన్నారు.ఈ సినిమా షూట్ ప్రెజెంట్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది అని టాక్.

ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమా గత రెండేళ్లుగా సెట్స్ మీదనే ఉంది.

Advertisement

వివిధ కారణాల వల్ల షూట్ వాయిదా పడుతూ వస్తుంది.ఇక ఎట్టకేలకు ఈ సినిమా పూర్తి చేసే పనిలో పవన్ బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా చేస్తూనే పవన్ కళ్యాణ్ మరొక కొత్త సినిమాను ప్రకటించాడు. హరిహర వీరమల్లు తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ఇటీవలే ప్రకటించాడు.

అలాగే సుజీత్ దర్శకత్వంలో కూడా మరొక సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా అలా ప్రకటించారో లేదో అప్పుడే భారీ అంచనాలు మొదలయ్యాయి.చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నప్పటికీ 2023 ఏడాది ఒక్క సినిమా అయినా రిలీజ్ అవుతుందో లేదో అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆందోళన చెందుతున్నారు.

హరిహర వీరమల్లు సినిమాతో పాటు హరీష్ శంకర్ సినిమా, సుజీత్ సినిమా కూడా ఈ ఏడాది పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు.అయితే ఫ్యాన్స్ మూడు సినిమాలు కాదు ఒక్క సినిమా వచ్చిన చాలు అంటున్నారు.

Validation Check 2026
జొన్న పిండితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!

ఎందుకంటే ఈ ఏడాది వీలైనంత షూట్ పూర్తి చేయలేక పోతే 2024 మొత్తం ఎలెక్షన్స్ కారణంగా పవన్ సినిమాలకు బ్రేక్ ఇవ్వడం ఖాయం.సో ఈ ఏడాది ఎంత వీలైతే అంత షూటింగ్ పూర్తి చేస్తేనే ఫ్యాన్స్ నిరాశ చెంద కుండా ఉంటారు.

Advertisement

అలా పూర్తి చేయలేక పోతే 2023-24 రెండేళ్లు కూడా పవన్ ను చూసే అదృష్టం ఉండదు.చూడాలి మరి ఈసారి అయినా పవన్ అనుకున్న విధంగా షూట్ పూర్తి చేస్తాడో లేదో.