ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ అప్డేట్.. యాక్షన్ సీక్వెన్స్ తో స్టార్ట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ( Harish Shankar )దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.

ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ప్రకటించిన కొత్తలో ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి కేవలం ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.ఆ చిన్న షెడ్యూల్ తోనే హరీష్ పవన్ పై అదిరిపోయే గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాడు.

అయితే పవన్ మళ్ళీ పొలిటికల్ పరంగా బిజీ అవ్వడంతో ఈయన క్రేజీ ప్రాజెక్టులు అన్ని కూడా వాయిదా పడాల్సి వచ్చింది.మళ్ళీ ఇటీవలే డేట్స్ కేటాయించడంతో షూటింగులు చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి. ఉస్తాద్( Ustaad Bhagat Singh ) కూడా షూటింగ్ స్టార్ట్ అయినట్టు మేకర్స్ ఇటీవలే అధికారికంగా తెలిపారు.

అయితే పవన్ లేని పార్ట్ ను మొన్నటి వరకు మేకర్స్ చిత్రీకరించారు.

Advertisement

ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ఈ సినిమా షూట్ లో పవన్ కూడా జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తుంది.పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ షెడ్యూల్ చిత్రీకరిస్తారని ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్షణ్ కాంబినేషన్ లో ఈ క్రేజీ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

మొత్తానికి ఈ సినిమా షూట్ స్టార్ట్ అవ్వడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.కాగా ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల( Sreeleela ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఉండబోతుంది అని టాక్.ఆ హీరోయిన్ ఎవరో ఇంకా ఫైనల్ కాలేదు.ఇక మైత్రి మూవీ మేకర్స్ ఉస్తాద్ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

అలాగే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మరి ఈ కాంబో గబ్బర్ సింగ్ వంటి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్లు ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు