జగన్ లెక్క తప్పిందా ? ఏకమవుతున్న ప్రత్యర్ధులు

అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఆ ప్రాంత మహిళలు,  రైతులు చేపట్టిన మహా పాదయాత్ర కు విశేషమైన స్పందన వస్తూ ఉండడం, ఏపీలో ప్రధానంగా చర్చనీయాంశం అవుతోంది.

  అమరావతి వ్యవహారం మరింత ఉదృతం అవ్వడం తదితర కారణాలతో ఏపీ అధికార పార్టీ వైసిపి కాస్త ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కుంటోంది.

ముఖ్యంగా అమరావతి వ్యవహారం తమకు ఇబ్బందులు తీసుకొస్తుందనే ఉద్దేశంతో వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని హైలెట్ చేసేందుకు ప్రయత్నించింది.  విశాఖ గర్జన పేరుతో  భారీ సభని నిర్వహించింది.

వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు,  కీలక నాయకులు అంతా విశాఖ గర్జనలో టిడిపి,  జనసేన పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.    ఇక అదే రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో అడుగుపెట్టారు.

ఈ సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకున్న పరిణామాలు,  పవన్ ను పోలీసులు అడ్డుకోవడం తదితర పరిణామాలు రాజకీయ రచ్చను రేపాయి.ఈ క్రమంలో టిడిపి , బిజెపిలు జనసేనకు సంఘీభావం ప్రకటించాయి.

Advertisement

ముఖ్యంగా బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు,  టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పవన్ కు ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు.అయితే ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది.

ఇప్పటికే ఏపీలో టిడిపి,  జనసేన పార్టీలు పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నాయనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.ఎన్నికల సమయంలో కచ్చితంగా పొత్తు ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం జనసేన, బీజేపీలు పొత్తు కొనసాగిస్తున్నాయి.   

  అయితే ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే వైసీపీ కచ్చితంగా ఓటమి చెందుతుందని లెక్కలు అందరిలోనూ ఉన్నాయి.అయితే ఇదంతా ఎన్నికల సమయంలో , అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది.అయితే ఇప్పుడు విశాఖలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈ మూడు పార్టీలు మరింత దగ్గర అయ్యాయని, ఉమ్మడిగా వైసిపిని ఎదుర్కోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

ఇదంతా జరగడానికి వైసిపి నే ఛాన్స్ ఇచ్చినట్లు అయింది.ప్రస్తుతం విశాఖలో పవన్ కు టిడిపి, బిజెపి అధ్యక్షులు సంఘీభావం తెలిపి, పవన్ తో మాట్లాడినా.అక్కడ పొత్తుల అంశం చర్చకు రాలేదు.

Advertisement

కానీ రాబోయే రోజుల్లో ఆ పొత్తుల బంధం బలపడేందుకు మాత్రం వైసీపీ నే ఛాన్స్ ఇచ్చినట్లు అయింది.అమరావతి రాజధాని అంశాన్ని డైవర్ట్ చేసేందుకు జనసేన అంశాన్ని హైలెట్ చేసేందుకు వైసిపి ప్రయత్నించినా.

పొత్తులు ఏర్పడేందుకు మాత్రం పరోక్షంగా వైసిపి  మార్గం చూపించింది అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

తాజా వార్తలు