పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
తన ఆటిట్యూడ్, మ్యానరిజంతో ఈ సినిమాను సూపర్ హిట్ గా నిలబెట్టాడు పవన్.ఇక ఈయన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాక మునపటి కంటే ఫాస్ట్ గా సినిమాలను పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో హరి హర వీరమల్లు సినిమా ఒకటి.
ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
కరోనా కారణంగా ఆగిన షూటింగ్ ఇటీవలే మరొక షెడ్యూల్ స్టార్ట్ చేసారు.ఆ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు శరవేగంగా పూర్తి చేసాడు క్రిష్.
ఇంకా 40 శాతం షూటింగ్ మిగిలి ఉండడంతో పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.పవన్ కళ్యాణ్ మధ్య మధ్యలో కొంత కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడు.
పవన్ రాజకీయాల కోసం కూడా సమయం కేటాయించాల్సి వస్తుండడంతో ఆయన సినిమాలకు బ్రేక్ ఇవ్వక తప్పడం లేదు.మరి ఇప్పుడు కూడా ఈయన సినిమాలకు బ్రేక్ ఇచ్చి రాజకీయాలపై ద్రుష్టి పెట్టాడు.
అయితే ఈ సినిమాపై గత కొంత కాలంగా ఒక రూమర్ వినిపిస్తుంది.క్రిష్ చెప్పిన కథ విషయంలో పవన్ సంతృప్తిగా లేరని కొద్దిగా చేంజెస్ చెప్పారని టాక్ వచ్చింది.
మరి క్రిష్ ఆ సూచనలను పాటించి ఫైనల్ చేసాడని అవన్నీ పూర్తి చేసి నెక్స్ట్ షెడ్యూల్ కోసం రెడీ అయినట్టు టాక్.మరి త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ పక్కాగా స్టార్ట్ కాబోతుందని ఇది నిర్విరామంగా కొనసాగించి షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
ఇక పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.మెగా సూర్య ప్రొడక్షన్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ దీంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ ప్రకటించాడు.అలాగే తమిళంలో సముద్రఖని తెరకెక్కించిన వినోదయ సీతమ్ అనే సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు.మరి ఈ రెండు సినిమాలు సెట్స్ మీదకు ఎప్పుడు వెళతాయో కూడా చెప్పలేని పరిస్థితి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy