ఆ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని భావించిన పవన్ కళ్యాణ్.. చివరకు?

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

మొన్నటి వరకు సినిమాలలో ఫుల్ బిజీబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ఇటీవలే జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో 21 స్థానాలలో చేయగా 21 స్థానాల్లో గెలిచి భారీ విజయాన్ని అందుకున్నారు.ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్.

ఇకపోతే పవన్ కెరియర్ విషయానికి వస్తే.మొదట అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో కెరీయర్ని మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ ఇష్టం లేకుండానే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

మొదటి సినిమాని ఆశించిన ఫలితాలను రాబట్ట లేకపోయింది.ఆ తర్వాత పవన్ నటించిన చిత్రాలన్నీ వరుసగా బ్లాక్ బస్టర్స్ అవుతూ వచ్చాయి.

Advertisement

అలా ఖుషి( kushi ) వరకు కొనసాగింది.ఖుషి చిత్రంతో పవన్ సౌత్ లో టాప్ హీరోల్లో ఒకరిగా మారిపోయారు.

ఆ సమయంలోనే నేను కూడా ఇక జాగ్రత్త పడాలి అని చిరంజీవి అన్నారట.టాప్ కార్పొరేట్ బ్రాండ్స్ కూడా పవన్ కి అత్యధిక రెమ్యునరేషన్ ఆఫర్ చేశాయట.

కానీ ఖుషి తర్వాత ఏదో మాయ జరిగినట్లు పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి.ఒకటి రెండు ఏళ్ళు కాదు దాదాపు పదేళ్లు పవన్ కి హిట్ లేదు.

ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన జానీ భారీ అంచనాలతో విడుదలై చతికిలబడింది.పవన్ చేసిన ప్రయోగానికి ప్రశంసలు దక్కాయి, కానీ ఆ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు.చాలా నిరాశపరిచింది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఆ చిత్రంతో నష్టాలు మిగిలాయి.ఆ తర్వాత ప్రయోగాలు చేయకుండా వినోదం ఉండేలా గుండుభా శంకర్ చిత్రం చేశారు.

Advertisement

వీర శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా వర్కౌట్ కాలేదు.ఆ తర్వాత వచ్చిన చిత్రం బాలు.

తనకి తొలిప్రేమ లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన కరుణాకరన్ దర్శకత్వంలో బాలు( Balu ) చిత్రం మొదలయింది.రిలీజ్ కి ముందే సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.ఇందులో ఇంటెన్స్ గా ఉండే స్టోరీ కూడా ఉంటుంది.

ఈ చిత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని పవన్ కళ్యాణ్ నమ్మారు.బహుశా అది డైరెక్టర్ కరుణాకరన్ పై నమ్మకం ఏమో.తొలి రోజు కాస్త డివైడ్ టాక్ వచ్చింది.ఫస్ట్ డే రిలీజ్ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ బాలు సక్సెస్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారట.

అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది అంటూ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.కానీ ఆ తర్వాత బాలు చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగా స్లో అయిపోయింది.పవన్ కళ్యాణ్ కి మరో ఫ్లాప్ మూవీగా నిలిచిందట.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన సినిమాల రిజల్ట్ గురించి పట్టించుకోవడం మానేశారు.తన పని తాను చేసుకుంటూ వెళ్లారు.

చివరికి గబ్బర్ సింగ్ చిత్రంతో కోరుకున్న హిట్ దక్కింది.

తాజా వార్తలు