జగన్ పై టీజింగ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్

ఇంతకాలం తన మంత్రులతో తనను తిట్టించిన వైసీపీ అధినేత ఇప్పుడు తనను ప్రత్యక్షంగా టార్గెట్ చేయడం పై పవన్ కళ్యాణ్( Pawan kalyan ) రియాక్ట్ అయ్యారు.

ట్విట్టర్ వేదికగా జగన్ పై విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టారు.

ఇంతకాలం వ్యక్తిగతంగా విమర్శలు చేయడం పై సంయమనం పాటించిన ఆయన స్వయంగా ముఖ్యమంత్రి తనపై వ్యక్తిగతంగా దాడి చేయడంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

రాజస్థాన్ ఎడారిలో రెండు సూట్ కేసుల నుండి డబ్బుతో హెలికాప్టర్ దిగిన జగన్( YS Jagan Mohan Reddy ) ను పోలిన ఒక ఫోటోను ట్విటర్ లో పోస్ట్ చేసిన పవన్, పాపం అమాయకుడు నోట్లో వేలు పెట్టినా కొరకలేడంటూ వ్యంగ్యం గా రాసుకొచ్చారు.మరో పోస్ట్ లో ఏపీ సీఎంతో ఎవరైనా సినిమా తీస్తే చిన్న చిన్న మార్పులు అవసరం అన్న ఆయన ఒక సూట్ కేస్ మనీ లాండరింగ్ కo పనీల ద్వారా అక్రమ సంపాదన ద్వారా వచ్చిందని చూపించాలని ఇక రాజస్థాన్లోని ఇసుకదిబ్బలకు బదులు నదుల నుంచి దోచుకున్న ఇసుక నిల్వ కేంద్రాలను చూపించాలని వ్యంగ్యంగా రాసుకొచ్చారు

.మరో పోస్ట్ లో ప్రియమైన ముఖ్యమంత్రీ , మీరేమీ పుచ్చలపల్లి సుందరయ్యో ,.తరిమెల నాగిరెడ్డో కాదని, నిత్యం ప్రజలను వేధించే మీకు వర్గ పోరు అని మాట్లాడే హక్కు కూడా లేదని ఏదో ఒక రోజు మీ అనుచరుల కబంద హస్తాల నుంచి రాయలసీమను విముక్తి చేస్తానని రాసుకొచ్చారు,, తనపై ఎన్ని విమర్శలు వైసిపి మంత్రులు చేస్తున్నా ఒక స్థాయి వరకు తట్టుకొని అప్పుడప్పుడు జవాబు చెబుతున్న పవన్ కళ్యాణ్ జగన్ వ్యక్తిగత వ్యాఖ్యలతో హర్ట్ అయినట్లుగా కనబడుతుంది ఒకప్పుడు ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమూరి రాధాకృష్ణన్ ( Ramakrishna )కేంద్రంగా చేసుకొని వరుస ట్వీట్ల తో సంచలనం రేకెత్తించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్ పై కూడా వరుస ట్వీట్లు చేసే అవకాశం కనపడుతుంది .ఇప్పటివరకు పరోక్ష వ్యూహాలను అమలు చేస్తున్న రాజకీయ పార్టీలు ఇక ప్రత్యక్ష విమర్శలకు దిగడంతో , ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పీక్ స్టేజ్ కి వెళ్తాయని అధికార ప్రతిపక్ష కార్యకర్తల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతుందని విశ్లేషణలు వస్తున్నాయి.మరి పవన్ కళ్యాణ్ విమర్శలపై అధికారపక్ష స్పందన ఏమిటో చూడాలి .

Advertisement
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

తాజా వార్తలు