పెందుర్తి వారాహి విజయభేరి సభలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తుండటంతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రచారంలో స్పీడ్ పెంచారు.బుధవారం మండపేట, ఎలమంచిలి, పెందుర్తి నియోజకవర్గలలో ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ క్రమంలో పెందుర్తిలో సీఎం జగన్ పై( CM Jagan ) పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.వైసీపీ నాయకులు భూములు దోచేస్తున్నారని ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం( YCP Govt ) అంత మూడు కబ్జాలు ఆరు పంచాయతీలు అంటూ సెటైర్లు వేయడం జరిగింది.జగన్ కి ఇచ్చిన ఒక ఛాన్స్ చాలని అన్నారు.

శక్తియుక్తులు, ప్రతిభా పాటవాలు ఉన్న లక్షల మంది యువతకు గంజాయి అలవాటు చేసి వారి జీవితాలను జగన్ చిన్న భిన్నం చేశారు.గంజాయిలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

యువతకు ఉపాధి కల్పించలేదు.ఫీజు రియంబర్స్ మెంట్( Fee Reimbursement ) చేయలేదు.అలాంటి జగన్ కి మీరు ఓటు వేస్తారా.? అంటూ నిలదీయడం జరిగింది.ఇలాంటి ప్రభుత్వంపై పోరాటం చేయాలంటే అందరూ ధైర్యంగా నిలబడాలి.

మరికొద్ది రోజులలో జరగబోయే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం.కూటమి ప్రభుత్వాన్ని స్థాపించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం.

కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే యువతలో ఉన్న నైపుణ్యాన్ని బట్టి శిక్షణ ఇస్తాం.వారికి ఉపాధి కల్పిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొనడం జరిగింది.

అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?
Advertisement

తాజా వార్తలు