దాసోజు శ్రావణ్ నీ పొగిడిన పవన్ కళ్యాణ్..!!

తెలంగాణ బీజేపీకి దాసోజు శ్రావణ్ రాజీనామా చేయడం తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది.

రాష్ట్ర బీజేపీ పార్టీలో పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి అధ్యక్షుడు బండి సంజయ్ కి రాజీనామా లేఖను పంపించడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉండగా దాసోజు శ్రావణ్ రాజీనామా పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.కంగ్రాట్యులేషన్స్ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.దాసోజు శ్రావణ్ ఒక డైనమిక్ లీడర్ అని కొనియాడారు.

ఆయన ఏ పార్టీలో ఉన్న తెలంగాణ కోసమే పనిచేశాడని శ్రావణ్ నిజమైన తెలంగాణ వాది అని పవన్ ప్రశంసించారు. ప్రజారాజ్యం పార్టీ నుండి టిఆర్ఎస్ లోకి అప్పట్లో ప్రత్యేక తెలంగాణ కోసం చేరారని గుర్తు చేశారు.

ఆయన చిత్తశుద్ధిని అందరూ గుర్తిస్తారని .దాసోజు శ్రవణ్ కి భవిష్యత్తులో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలియజేశారు. ఇదిలా ఉంటే దాసోజు శ్రావణ్ అధికార పార్టీ టిఆర్ఎస్ లో జాయిన్ కానున్నట్లు మరోపక్క వార్తలు వస్తున్నాయి.

Advertisement
కేసీఆర్ కవిత సైలెన్స్ .. బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది ? 

తాజా వార్తలు