ఎన్నికలు పూర్తి అయ్యేవరకు నో సినిమా షూటింగ్స్..పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అటు రాజకీయాలు ఇటు సినిమాలు అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు.ఇంత బిజీ వాతావరణం లో ఉండే సెలబ్రిటీ ఇండియా లోనే ఎవ్వరూ లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

రెండిటి మీద సంపూర్ణ ద్రుష్టి పెడితే కానీ సక్సెస్ లు రావడం అసాధ్యం.2019 ఎన్నికల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు చేస్తే అందులో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.ఇంత ఒత్తిడి మధ్య ఆయన అంత అద్బుతంగా ఎలా నటించాడో అభిమానులకు కూడా అంతుచిక్కని ప్రశ్న.

మరోపక్క రాజకీయం గా కూడా ఆయన జనసేన పార్టీ ని( Janasena Party ) క్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేసాడు.ఇలా రెండు మహా సముద్రాలు వంటి రంగాలలో సమర్థవతంగా ముందుకు సాగడం అనేది కత్తిమీద సాము లాంటిదే.

ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం తెలంగాణ ఎన్నికలు( Telangana Elections ) జరగబోతున్నాయి.సరిగ్గా 20 రోజుల సమయం కూడా లేదు.జనసేన పార్టీ తరుపున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 8 మంది పోటీ చెయ్యబోతున్నారు.

నామినేషన్స్ కూడా ముగించేశారు.అయితే ఆంధ్ర ప్రదేశ్ లో( Andhra Pradesh ) కూడా ఎన్నికల పర్వం అతి త్వరలోనే మొదలు కాబోతుండడం వల్ల పవన్ కళ్యాణ్ ఎన్నికలు పూర్తి అయ్యేవరకు సినిమా షూటింగ్స్ కి దూరం గా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Advertisement

ప్రస్తుతం ఆయన ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ మరియు హరి హర వీరమల్లు వంటి సినిమాలు చేస్తున్నాడు.వీటిలో ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustad Bhagat Singh ) సినిమా తప్ప మిగిలిన రెండు సినిమాల షూటింగ్స్ 50 శాతం కి పైగా పూర్తి అయ్యాయి.

మిగిలిన భాగం షూటింగ్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే వరకు ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

అంటే వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవ్వడం కష్టమే.భీమ్లా నాయక్ తర్వాత భారీ గా గ్యాప్ వచ్చేసింది.ఈ ఏడాది విడుదలైన బ్రో ది అవతార్ చిత్రం లో కేవలం పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించాడు.

అభిమానాలను ఈ చిత్రం నిరాశ పర్చింది.పోనీ రాజకీయ పరంగా యాక్టీవ్ గా ఉన్నాడా అంటే నెల రోజుల నుండి వారాహి విజయ యాత్ర( Varahi Vijaya Yatra ) ఆగిపోయింది.

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

ఈ నెలలో కూడా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది డార్క్ పీరియడ్ అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు