Pawan Kalyan : ఇలాంటి యాటిట్యూడ్ పవన్ కు మాత్రమే సొంతం.. వీడియో వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన ట్రెండ్ ఫాలో అవ్వడు.

ట్రెండ్ సెట్ చేస్తాడు.యూత్ లో తనకంటూ ప్రత్యేకమైన ట్రెండ్ ను సెట్ చేసిన స్టార్ పవర్ స్టార్.

ఇప్పటి కంటే ఈయన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఈయన యాటిట్యూడ్ వేరే లెవల్లో ఉండేది.ఈయన యాటిట్యూడ్ కు యువత దాసోహం అయ్యేది.

అందుకే పవన్ కళ్యాణ్ కు భారీ క్రేజ్ ఏర్పడింది.ఈయన సినిమా వస్తుంది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఊపేస్తారు.

Advertisement

ఈయన సినిమాల్లో యాటిట్యూడ్ అందరికి పరిచయమే.మరి ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంటర్ అయినా తర్వాత కూడా ఈయన అదే యాటిట్యూడ్ మైంటైన్ చేస్తూ వస్తున్నాడు.

తాజాగా వైరల్ అయినా ఈ వీడియో చుస్తే మీరు కూడా ఇదే నిజం అంటారు.పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో భాగంగా తాజాగా నిన్న ఒక కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా.

అప్పుడు కారు పైకి ఎక్కి కూర్చుని తన యాటిట్యూడ్ లోని మాస్ స్వాగ్ ను చూపించాడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.ఇలాంటివి పవన్ కు మాత్రమే సొంతం అని ఆయనకు మాత్రమే సాధ్యం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే.ప్రెజెంట్ పవన్ చేతిలో ఉన్న సినిమాల్లో హరి హర వీరమల్లు సినిమా ఒకటి.క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

Lorem Ipsum Dolor Sit Amet
Lorem Ipsum Dolor Sit Amet

పవన్ కళ్యాణ్ ఆర్డర్ లో ఒక రీమేక్ సినిమా కూడా ఉంది.తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సీతమ్ అనే సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు.

Advertisement

అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చేస్తున్నాడు.

తాజా వార్తలు