మెగాస్టార్ చిరంజీవిని కలిసిన జనసేనాని, విషయం ఏంటో!

మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు అన్నదమ్ములు అయినా వాళ్ల బిజీ లైఫ్ లో ఇద్దరూ కలవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.

ఎందుకంటే చిరంజీవి తన సినిమాలతో బిజీ గా ఉంటే జనసేనాని కూడా తన రాజకీయ పనులతో చాలా చాలా బిజీ అయిపోయారు.

అయితే చాలా రోజుల తరువాత వీరిద్దరూ మళ్లీ కలుసుకున్నారు.అన్న చిరంజీవిని కలవడానికి పవన్ కళ్యాణ్ తన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తో కలిస్ మరీ వెళ్లారట.

ఈ సందర్భంగా వారు ముగ్గురు కలిసి ఫోటో కూడా తీసుకున్నారు.ఈ ఫోటో ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్నీ వెల్లడించారు.

పవన్ అన్న మెగాస్టార్ ని కలిశారని,చిరంజీవి గారితో కలిసి ఎన్నో విషయాలు చర్చించామని ట్విట్టర్ లో పేర్కొన్నారు.అలానే ఆయన తన లైఫ్ జర్నీలో ఎదురైన అనుభవాలను తమతో కలిసి పంచుకున్నారని అవి తమకు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు.

Advertisement

ఆయన్ను కలిసేందుకు రాబోయే రోజుల్లో ఇలాంటి అవకాశాలు మళ్లీ రావాలని, అలానే చిరంజీవి గారికి రాబోయే రోజుల్లో అంతా విజయమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.ప్రస్తుతం మెగాస్టార్ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డి జీవిత‌క‌థ ఆధారంగా తెరకెక్కిస్తున్న `సైరా` మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నిర్మాతగా, సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా, పలువురు సినీ సెలబ్రిటీలు ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం.ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ రెండన విడుదలకు ముస్తాబవుతోంది.

Advertisement

తాజా వార్తలు