తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈయన సినిమా కెరియర్ లో చేసినది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఈయనకు మాత్రం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలతో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా క్షణం తీరిక లేకుండా తన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి సీనియర్ నటి లయ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.
ఈ సందర్భంగా ఆలయ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకు సంబంధించిన అన్ని విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా తన పెళ్లి గురించి కూడా ఈమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.2006వ సంవత్సరంలో డాక్టర్ శ్రీ గణేష్ తో తన వివాహం జరిగిందని తెలిపారు.అయితే తను తన వివాహానికి ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించాను.
అయితే అప్పటివరకు తాను పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఏ సినిమాలోనూ నటించలేదు ఆయనని కలిసింది కూడా లేదని తెలిపారు.తన వివాహానికి ఆహ్వానించడం కోసం ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా తన దగ్గరకు వెళ్లానని అయితే తన పేరు చెప్పగానే పవన్ కళ్యాణ్ గారు తనని లోపలికి రమ్మన్నారని తెలిపారు.
ఇలా పవన్ కళ్యాణ్ గారితో కొంత సమయం మాట్లాడి పెళ్లికి తప్పకుండా రావాలని ఇన్విటేషన్ కార్డు ఇచ్చి వచ్చాను.ఆ రోజు ఆయన తప్పకుండా వస్తాను అని చెప్పారు.కానీ నేను పవన్ కళ్యాణ్ గారితో ఏ సినిమాలోను నటించలేదు కనుక ఆయన ఫార్మాలిటీకి వస్తానని చెప్పారు కానీ అతను రారు అని అనుకున్నాను కానీ సడన్గా పెళ్లి రోజు ఆయన మండపంలో ప్రత్యక్షం అవ్వడంతో ఒక్కసారిగా షాక్ అయ్యానని లయ తెలిపారు.
కేవలం పెళ్లికి వస్తాను అని ఇచ్చిన మాట కోసం ఆయన తన పెళ్లికి వచ్చారని.పవన్ కళ్యాణ్ గారు వస్తారని అస్సలు ఊహించలేదని తెలిపారు.అయితే అందరి గెస్ట్లు కన్నా ముందుగా పవన్ కళ్యాణ్ గారు తన పెళ్లికి హాజరయ్యారనీ ఈ సందర్భంగా అప్పటి సంఘటనలను ఈమె గుర్తు చేసుకుంటూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy