గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ని వదులుకున్న అన్ లక్కీ హీరో ఎవరో ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నప్పటికీ గబ్బర్ సింగ్( Gabber Singh ) సినిమాకు ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పాలి.

బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి దబాంగ్ సినిమాకు రీమేక్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమాకు డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వం వహించగా శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకం పై బండ్ల గణేష్ ( Bandla Ganesh ) ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతిహాసన్ నటించారు.

ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.

అప్పటివరకు వరుస ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ సినిమా భారీ బ్లాక్ బస్టర్ కావడంతో అభిమానులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నటి శృతిహాసన్ కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.అప్పటివరకు వరుస ఫ్లాప్ సినిమాలు ఎదుర్కొన్నటువంటి ఈమెను ఇండస్ట్రీలో అందరూ కూడా ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేసేవారు కానీ ఈ సినిమా సక్సెస్ తో వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోలేదు.

Advertisement

ఈ విధంగా గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో కూడా ఒక స్పెషల్ సినిమా గానీ నిలిచిపోయింది.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.ఇదిలా ఉండగా తాజాగా గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.

డైరెక్టర్ హరి శంకర్ గబ్బర్ సింగ్ సినిమాకి ముందుగా అనుకున్న హీరో పవన్ కళ్యాణ్ కాదట.ఈ సినిమాకు మాస్ మహారాజా రవితేజ ( Raviteja )అయితే బాగుంటుందని భావించిన డైరెక్టర్ ఆయనని కలిసి తనకు ఈ సినిమా కథ చెప్పగా అప్పటికే రవితేజ చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈ సినిమా అవకాశాన్ని వదులుకున్నారు దీంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో భాగమయ్యారు ఇలా పవన్ కెరియర్లో ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు