దేవుడా.. పవన్ షూల కోసమే అంత ఖర్చు చేశారా.. ఆ షూస్ ఖరీదెంతంటే?

సాధారణంగా ఏ స్టార్ హీరోకు అయినా అభిమానులు ఉంటారు.అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) మాత్రం భక్తులు ఉంటారు.

పవన్ ఏం చేసినా అభిమానులకు నచ్చుతుంది.యూత్ లో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా పవన్ కళ్యాణ్ కు పేరుంది.

పవన్, సాయితేజ్ కాంబో మూవీకి బ్రో ( Bro Movie ) అనే టైటిల్ వినిపించిన సమయంలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేసినా తర్వాత రోజుల్లో ఈ టైటిల్ బాగుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.తాజాగా విడుదలైన పోస్టర్ లో పవన్ షూస్( Pawan Kalyan Shoes ) హాట్ టాపిక్ అయ్యాయి.

ఒక షూ బ్లాక్ కలర్ లో ఉండగా మరో షూ వైట్ కలర్ లో ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.అయితే స్టైల్ కోసమే పవన్ అలాంటి షూస్ వేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

Advertisement

బ్రో సినిమా కోసం బాల్మేన్ కంపెనీకి చెందిన మూడు జతల షూలను పవన్ కోసం ప్రత్యేకంగా తెప్పించారని సమాచారం.

ఒక్కో జత ఖరీదు లక్ష రూపాయలు అని మూడు జతల కోసం ఏకంగా మూడు లక్షల రూపాయలు ఖర్చు చేశారని బోగట్టా.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా సినిమాలను నిర్మిస్తుండటం గమనార్హం.ఈ బ్యానర్ సక్సెస్ రేట్ కూడా ఎక్కువేననే సంగతి తెలిసిందే.

జులై నెల 28వ తేదీన బ్రో సినిమా రిలీజ్ కానుండగా సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

బ్రో మూవీ కొత్త పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.పవన్ సాయితేజ్ లకు( Pawan Saitej ) ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు.రాబోయే రోజుల్లో కూడా పవన్ సాయితేజ్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

సినిమా సినిమాకు పవన్ పారితోషికం పెరుగుతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు