ఒక రోజు ముందే ఆహా ట్రీట్.. అవైటెడ్ పవర్ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ గెట్ రెడీ!

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూనే ఒక టాకింగ్ షోకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

అన్ స్టాపబుల్ షో తో బాలయ్య మొదటిసారి వ్యాఖ్యాతగా మారిపోయాడు.

ఈ షో సీజన్ 1 ఘన విజయం సాధించింది.సీజన్ 1 అనుకున్న దాని కంటే ఎక్కువ విజయం సాధించడంతో పార్ట్ 2 స్టార్ట్ చేసారు.

ఆహా వారు పార్ట్ 2 ను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్టార్స్ ను గెస్టులుగా తీసుకు వస్తూ వారి ఫ్యాన్స్ కు ఫుల్ ఎగ్జైట్ మెంట్ కలిగిస్తున్నారు.ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఈ షోకు తీసుకు వచ్చి డార్లింగ్ ఫ్యాన్స్ ను అలరించారు.

ఈయన ఎపిసోడ్ రెండు పార్టులుగా ప్రసారం చేసి పూనకాలు తెప్పించారు.ప్రభాస్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా యాప్ షేక్ అయ్యింది.

Advertisement
Pawan Kalyan Balakrishna Unstoppable Episode Streaming Date Fix Details, Pawan K

ఇక ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆహా యాప్ కు సైతం పూనకాలు తెప్పించడానికి సిద్ధం అవుతున్నారు.ఎందుకంటే నెక్స్ట్ రాబోతుంది పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్.

Pawan Kalyan Balakrishna Unstoppable Episode Streaming Date Fix Details, Pawan K

ఈయన ఎపిసోడ్ కు సంబంధించి ఇప్పటికే పోస్టర్స్, టీజర్ కూడా ఆహా వారు రిలీజ్ చేయగా వాటికీ అదిరిపోయే స్పందన కూడా వచ్చింది.మరి ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న క్రమంలోనే ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 3న స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ఆహా నిర్వాహకులు అనౌన్స్ చేసారు.దీంతో ఆ రోజు కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Pawan Kalyan Balakrishna Unstoppable Episode Streaming Date Fix Details, Pawan K

మరి ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆహా వారు చిన్న ఛాలెంజ్ పెట్టారు.ఈ ఛాలెంజ్ ను గంటలోపే ఫ్యాన్స్ పూర్తి చేయడంతో ఒకరోజు ముందుగానే ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు.ఈ మోస్ట్ అవైటెడ్ ఎపిసోడ్ పార్ట్ 1 ను ఒక రోజు ముందే స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు.

దీంతో ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 2నే స్ట్రీమింగ్ కానుంది.చూడాలి మరి ఫ్యాన్స్ నుండి ఏ ఎపిసోడ్ కు ఎలాంటి స్పందన వస్తుందో.

నటుడిగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే 5 సినిమాలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు