#OG లో ‘గాంధీ’ గా పవన్ కళ్యాణ్..ఆయన పాత్ర ఎలా ఉంటుందంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి దేశ భక్తి చాలా ఎక్కువ, అంటే మిగతా హీరోలకు లేదని కాదు కానీ, పవన్ కళ్యాణ్ ఫ్రీడమ్ ఫైటర్స్ పేరు ఎత్తితే వారి గురించి గంటలు గంటలు ఉపన్యాసాలు ఇస్తుంటాడు, అంత పిచ్చి ఆయనకీ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే.

అందుకే తానూ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నిటికీ ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లను పెట్టుకుంటున్నాడు.

రీసెంట్ గా ఆయన హరీష్ శంకర్( Harish Shankar ) తో ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustad Bhagat Singh ) అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమా సినిమా ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది, మరో షెడ్యూల్ అతి త్వరలోనే వైజాగ్ లో జరగనుంది.

ఇక ఈ చిత్రం తర్వాత ఆయన ఎంతో శ్రద్ద పెట్టి చేస్తున్న మరో చిత్రం #OG.ప్రముఖ డైరెక్టర్ సుజిత్( Director Sujith ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమా మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది.

Advertisement

అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు లీక్ అయ్యి , సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.ఇందులో ఆయన గాంధీ గా నటించబోతున్నాడట.#OG లో G అంటే గాంధీ అని అర్థం అయిపోయింది.

ఇన్ని రోజులు #OG అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అందరూ అనుకున్నారు, అది నిజమే కానీ ఒకే పదం కి రెండు పర్యాయ పదాలు ఉండేట్టుగా, పవన్ కళ్యాణ్ క్యారక్టర్ పేరు ని కూడా టైటిల్ లో కలిసొచ్చేలా చేసాడు డైరెక్టర్ సుజిత్.ఈయన కూడా హరీష్ శంకర్ లాగానే పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని.

గబ్బర్ సింగ్ మొదటి రోజు మొదటి ఆట చూసి థియేటర్ నుండి బయటకి వస్తూ, జిందాబాద్ పవర్ స్టార్ అంటూ అరుస్తూ వచ్చే వీడియో ని మనం చూడొచ్చు.ఇండస్ట్రీ కి ఆయన కేవలం పవన్ కళ్యాణ్ తో సినిమా తియ్యాలి అనే కసితో అడుగుపెట్టాడట.

అనుకున్న కలని మొత్తానికి నెరవేర్చుకున్నారు సుజిత్.ఇక ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ కి అన్నయ్య మరియు వదిన పాత్రలలో కిక్ శ్యామ్ మరియు శ్రియా రెడ్డి నటిస్తున్నారు.రీసెంట్ గానే శ్రీయా రెడ్డి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

ఈ చిత్రం లో ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా మరియు రఫ్ గా ఉంటుందట.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని #RRR మూవీ మేకర్స్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు.

Advertisement

ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరో హీరో ఇమ్రాన్ హష్మీ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు.ఇప్పటికే 39 రోజులు షూటింగ్ ని జరుపుకున్న ఈ చిత్రం , అక్టోబర్ లోపు షూటింగ్ ని పూర్తి చేసుకొని డిసెంబర్ లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

తాజా వార్తలు