కెసిఆర్ కి భయపడుతున్న చిరు, పవన్ కళ్యాణ్ ?

చిరంజీవి - ఇది నిన్నటి సంచలనం పవన్ కళ్యాణ్ - ఇది ఇవాల్టి సంచలనం.

ఒకరు రాజకీయంగా అట్టర్ ప్లాప్ అవగా మరొకరు సూపర్ హిట్ అవుతూ దూసుకుని వెళుతున్నారు.

అయితే క్రియాశీలక రాజకీయాలలోకి వస్తూ దూసుకెళ్ళే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఇంకా రూపాంతరం చెందాల్సి ఉంది.ప్రస్తుత గ్రేటర్ ఎన్నికల నేపధ్యంలో వీరిద్దరినీ బాగా వాడదాం అన్ని కొన్ని కాంగ్రెస్ - బీజేపీ లు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

గ్రేటర్ లో సెట్లర్ జనాభా ఎక్కువగా ఉండడం తో అక్కడ వీరిద్దరితో ప్రచారం కలిపిస్తే అది పార్టీలకి మేలు చేస్తుంది అనేది వారి ఆలోచన.పవన్ కళ్యాణ్ ను రమ్మని అడుగుతాం అని భాజపానేత కిషన్ రెడ్డి పదే పదే చెబుతున్నారు.

ఇప్పుడు ఈ గానానికి కాంగ్రెస్ నేత ఉత్తమ కుమార్ రెడ్డి కోరస్ తోడయింది.తమ కాంగ్రెస్ పార్టీ తరపున మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేస్తారని ఆయన అంటున్నారు.

Advertisement

కానీ ఇద్దరూ ఆంధ్రా లో ఏదైనా హడావిడి చెయ్యగలరేమో కానీ తెలంగాణా లో కెసిఆర్ కి ఎదురు వెళ్ళడం వారిద్దరికీ సుతరామూ ఇష్టం లేదు అని చెబుతున్నారు విశ్లేషకులు.అందువల్ల అన్నదమ్ములు ప్రచారానికి వస్తారా అంటే అనుమానమే.

మహా వచ్చినా, చంద్రబాబు మాదిరిగా ఏదో ఒక సమావేశం పెట్టేసి, కేసిఆర్ పై విమర్శలు కాకుండా, హైదరాబాద్ నగర ప్రాముఖ్యత, దాని వైశాల్యము, అభివృద్ది, ఇతరత్రా లక్ష్యాలు లాంటి వ్యాసరచన పోటీకి పనికి వచ్చే ప్రసంగాలు చేసి వెళ్తారు.అంతకు మించి ఎక్కవ ఆశించడం అత్యాశే.

బలమైన ప్రత్యర్ధి చంద్రబాబే సైలెంట్ గా ఉంటూ పెద్ద ప్రచారం చెయ్యని నేపధ్యంలో వీరిద్దరూ రంగంలోకి దిగుతారా దిగి కెసిఆర్ ని ఎదురు కొంటారా అనేది డౌట్.నిజానికి కెసిఆర్ కి ఎవరైనా భయపడాల్సిందే తెలంగాణా లో అందులో వీరిద్దరూ కూడా ఒక్కటే పెద్ద వింతేమీ కాదు.

Pic Talk : Pooja Hegde Makes A Cocktail For Her Dad
Advertisement

తాజా వార్తలు