డైలమాలో పవన్ 30వ చిత్రం.. జుట్టు పీక్కుంటున్న ఫ్యాన్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యణ్ నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, అనౌన్స్‌మెంట్లను తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయా చిత్ర యూనిట్‌లు రిలీజ్ చేశారు.

ఇప్పటికే పవన్ నటిస్తున్న వకీల్ సాబ్, దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో పవన్ చేయబోతున్న చిత్రం, దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో పవన్ సినిమాలకు సంబంధించిన పోస్టర్స్‌ను చిత్ర యూనిట్‌లు రిలీజ్ చేశారు.

కాగా ఈ క్రమంలో పవన్ తన నెక్ట్స్ చిత్రాన్ని ఎప్పుడు ప్రారంభిస్తాడా అని అందరూ ఆక్తిగా చూస్తు్న్నారు.అయితే పవన్ కళ్యాణ్ నటించబోయే 30వ చిత్రం గురించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు.

Pawan Kalyan 30th Movie In Dilemma, Pawan Kalyan, PSPK30, Trivikram, Venky Atlur

కాగా ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.అయితే పవన్ 30వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తాడనే వార్త గతకొద్ది రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లుకొడుతోంది.

కాగా మరో యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి పవన్‌కు ఓ అదిరిపోయే కథను వినిపించాడని, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందనే వార్త కూడా ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.మరి ఈ ఇద్దరిలో పవన్ ఎవరికి ఛాన్స్ ఇస్తాడా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement

ఇప్పటికే మూడు సినిమాలను లైన్‌లో పెట్టిన పవన్, మరో డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కూడా ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు.మరి ఈ క్రమంలో పవన్ తన 30వ చిత్రాన్ని ఎవరితో తెరకెక్కిస్తాడా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

ఏదేమైనా ఈ ప్రశ్నకు సమాధానం రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు పవన్ ఫ్యా్న్స్.

Advertisement

తాజా వార్తలు