అంతా పవన్‌ అయితే కష్టమే..!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.

ఈ సినిమాకు పవన్‌ అధికారికంగా కథ మరియు స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు.

అయితే అనధికారికంగా మాత్రం ఈ చిత్రాన్ని అంతా తానై నడుపుతున్నాడట.ఫైట్‌ విషయం నుండి లొకేషన్స్‌ ఎంపిక అవరకు అంతా కూడా తన కనుసన్నల్లోనే జరిగేలా పవన్‌ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అనధికారిక సమాచారం అందుతోంది.

సంగీతాన్ని కూడా పవన్‌ తన అభిరుచికి తగ్గట్లుగానే రెడీ చేయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఇలా పవన్‌ అన్నింట్లో వేలు పెట్టడంతో ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్‌ కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో పవన్‌ కళ్యాణ్‌ ‘జానీ’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెల్సిందే.ఆ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిలింది.

Advertisement

ఆ సినిమాకు పవన్‌ అన్ని తానై చేశాడు.ఆ సినిమా ప్రభావంను ఫ్యాన్స్‌ ఇప్పటికి మర్చి పోలేరు.

అంతటి డిజాస్టర్‌ సినిమా తర్వాత మళ్లీ పవన్‌ కళ్యాణ్‌ దర్శకత్వం వహించాని పలు సార్లు భావించాడు.కాని ఫ్యాన్స్‌ మాత్రం అందుకు వ్యతిరేకించారు.

కొన్ని కారణాల వల్ల పవన్‌ దర్శకత్వం చేయాలని భావించినా అది సాధ్యం అవ్వడం లేదు.కాని ఈ సినిమాకు మాత్రం పవన్‌ ఆ సరదాను తీర్చుకుంటున్నట్లుగా అనిపిస్తోంది.

బాబీ దర్శకత్వం అని అంటున్నా కూడా అన్ని తానై ఈ సినిమాను తీర్చి దిద్దుతున్నాడు.నిర్మాణం నుండి అన్ని విషయాలను పవన్‌ చూస్తుండటంతో కష్టమే అని సినీ వర్గాల వారు అంటున్నారు.

హీరోయిన్లతో అఫైర్స్.. హీరోలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భార్యలు..

ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisement