తెలంగాణ పై డిసైడ్ అయిపోయిన పవన్ ? యాత్రకు ఏర్పాట్లు ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారారు.టిడిపి తో ఆయన జాతకట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఆ విషయంపై క్లారిటీకి వచ్చేసారు.రాబోయే ఎన్నికల్లో బిజెపి,  జనసేన,  టిడిపి కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అయితే ఈ విషయంలో బిజెపి నుంచి సరైన క్లారిటీ లేకపోయినా.  ఎన్నికల సమయం నాటికి అది జరిగే అవకాశం ఉంది.

పవన్ పూర్తిగా ఏపీ పైనే దృష్టి సారిస్తారని అంత భావిస్తూ ఉండగా.  పవన్ చూపు ఇప్పుడు తెలంగాణ పైన పడింది.

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తామంటూ స్వయంగా పవన్ ప్రకటన చేశారు.

అంతేకాదు తెలంగాణలో తమ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ? 2023 ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించగలము అనే విషయాల పైన సర్వే చేస్తున్నట్లు సమాచారం.ఇక ఏడు నుంచి 14 అసెంబ్లీ సీట్లు , రెండు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపే ఆలోచనలో పవన్ ఉన్నారట.

         మొదటి ప్రాధాన్యంగా ఏపీ పైనే దృష్టి పెట్టినా.తరువాత తెలంగాణలో సత్తా చాటుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు.ఈ మేరకు తెలంగాణలో పర్యటించి క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవాలనే ప్రయత్నాల్లో పవన్ ఉన్నారు .తన సినీ అభిమానులు , జన సైనికులు అండతో తెలంగాణలో తప్పకుండా ప్రభావం చూపించగలననే నమ్మకంతో ఆయన ఉన్నారు.ఇదిలా ఉంటే తెలంగాణలోని కొండగట్టు నుంచి యాత్రను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారట.

ఈ మేరకు ఈ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.దీనికి సంబంధించి పార్టీ కీలక నాయకులతోను పవన్ చర్చించారట.

ఈ రాశుల వారు పక్కవారి ఐడియాలను కాపీ చేస్తారు..!

ఈ మేరకు పవన్ తో జరిగిన సమావేశంలో జనసేన తెలంగాణ ఇన్చార్జి శంకర్ గౌడ్ తో పాటు కొంతమంది పాల్గొన్నారు.అయితే పవన్ జనసేన ను తెలంగాణలో యాక్టివ్ చేయడంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     

Advertisement

2019 ఎన్నికల్లో జనసేన ఏపీలో జరిగిన ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానానికి పరిమితమైందని ఇంకా అక్కడ క్షేత్రస్థాయిలో బలం పెంచుకునే విషయంలో విఫలం అవుతుందని,  ఆ పార్టీకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పవన్ అభిమానులు, కాపు సామాజిక వర్గం అండదండలు ఉన్నా పవన్ అక్కడ పార్టీని ఇంకా బలోపేతం చేసుకోలేకపోయారని , అసలు ఏం మాత్రం బలం లేని తెలంగాణలో జనసేన ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం శూన్యం అనే విమర్శలు అప్పుడే మొదలైపోయాయి.   .