జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనేది అందరికీ ఆసక్తికరంగానే ఉంది.2019 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక ,భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ రెండు చోట్ల ఓటమి చెందారు.
జనసేన ఒంటరిగా పోటీ చేయడంతో పవన్ ఓటమి చెందాల్సి వచ్చింది.
అయితే ఈసారి టిడిపీ, బిజెపి పొత్తుతో ఎన్నికలకు వెళ్ళబోతున్న క్రమంలో తన గెలుపు నల్లేరు మీద నడకే అని పవన్ భావిస్తున్నారు.ఈ ఎన్నికల్లో తప్పకుండా గెలిచి తీరుతాననే నమ్మకంతో పవన్ ఉన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచే మళ్లీ పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో పవన్ ఉన్నారట .
ఈ మేరకు అక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు .అయితే పవన్ ఒకచోట ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేక గత ఎన్నికల మాదిరిగా రెండు చోట్ల పోటీ చేస్తారా అనేది తేలల్సి ఉంది.అయితే పవన్ సన్నిహిత వర్గాలు మాత్రం ఆయన ఒక్కచోట నుంచి పోటీ చేస్తారని , అది భీమవరం అని చెబుతున్నారు.
అంతేకాకుండా భీమవరంలో పవన్ నివాసం కూడా ఉండేందుకు ఒక ఇంటిని చూస్తున్నారని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి.నిన్ననే పవన్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మంగళవారం విశాఖపట్నం( Visakhapatnam ) కి వెళ్ళిన పవన్ అక్కడ వివిధ నియోజకవర్గాల నాయకులతో ఎన్నికల వ్యవహాలపై చర్చించారు.ఈ సందర్భంగా కొంతమంది అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లుగా ప్రచారం జరిగింది.
ఇక ఆ తరువాత భీమవరం వెళ్ళిన పవన్ అక్కడ టిడిపి ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు పశ్చిమగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షురాలు , భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి అయిన తోట సీతారామలక్ష్మి నివాసానికి పవన్ వెళ్లారు .ఈ సందర్భంగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు( Nimmala Ramanaidu ) తోపాటు మరికొంతమంది నేతలు పవన్ తో సమావేశం అయ్యారు.ఈసారి తాను భీమవరం నుంచే పోటీ చేస్తానని ,తనకు అంతా సహకరించాలని పవన్ టిడిపి నేతలకు విజ్ఞప్తి చేశారట.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy