Pawan Kalyan : ఎంపీ ,ఎమ్మెల్యే గా  పవన్ పోటీ ? 

ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి.

  ఎన్నికల కు సమయం దగ్గరపడిన దృష్ట్యా ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు  ఎవరికి వారు రాజకీయ రాజకీయ వ్యూహాల్లో నిమగ్నమయ్యారు.

బిజెపితో పొత్తు కోసం టిడిపి అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు .దాదాపుగా బిజెపితో పొత్తు  కుదిరినట్లే అన్న ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే బీజేపి అగ్ర నేతలతో భేటీ అయిన ఇద్దరు నేతలు అమిత్ షా,  జెపి నడ్డా లతో పొత్తుల అంశం పై చర్చలు జరిపారు.  ఈరోజు మరోసారి మూడు పార్టీలకు చెందిన నేతల ఉమ్మడి సమావేశం ఉంటుందని , ఆ తరువాతే అధికారికంగా పొత్తుపై ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

ఆయన పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దిగబోతున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా వస్తూనే ఉన్నాయి .దీంతో ఆ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీత( Vanga Geetha )ను పవన్ పై పోటీకి దింపుతారనే ప్రచారం జరుగుతోంది .

Advertisement

ఇదిలా ఉంటే.  వచ్చే ఎన్నికల్లో ఒక అసెంబ్లీ , మరో పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే విధంగా పవన్ ప్లాన్ చేసుకుంటున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది .దీనిపై అటు పవన్ గాని , జనసేన నుంచి గాని అధికారికంగా ఏ క్లారిటీ రాలేదు .కానీ ఒక ఎమ్మెల్యే మరో ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో మాత్రం పవన్ ఉన్నారట.ఎంపీగా గెలిస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో చేరి కేంద్ర మంత్రి పదవి తీసుకునే ఆలోచనలు పవన్ ఉన్నారట.

అయితే తాను ఎంపీగా పోటీ చేయడం వల్ల పవన్ ఏపీ రాజకీయాలను పట్టించుకోరని,  పూర్తిగా ఢిల్లీకే  పరిమితం అవుతారని వైసీపీ విమర్శలు చేసే అవకాశం ఉండడంతో , దీనిపై పవన్ తర్జన భర్జన పడుతున్నారట .బిజెపితో పొత్తు విషయమై అధికారికంగా ప్రకటన వెలువడిన తర్వాత  దీనిపై పవన్ ప్రకటన చేసే అవకాశం ఉందట.

Advertisement

తాజా వార్తలు