కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి నటిగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నటి పవిత్ర లోకేష్(Pavitra Lokesh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈమె కన్నడ తెలుగు భాష చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక తెలుగులో నటుడు నరేష్ (Naresh) తో నటించడమే కాకుండా ఆయనతో రిలేషన్ లో కూడా ఉండడంతో ఒక్కసారిగా వీరి వ్యవహారం పెద్ద ఎత్తున వార్తల్లోకి వచ్చింది.ఈ విధంగా నటుడు నరేష్ పవిత్ర లోకేష్ గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇకపోతే పవిత్ర లోకేష్ ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు కన్నడ భాషలో పిహెచ్డి చేయాలనే ఈమె పిహెచ్డి ప్రవేశ పరీక్ష(Ph.D Entrance Exam) రాసిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈమె మే నెలలో ఈ పీహెచ్డీ ప్రవేశ పరీక్షను రాశారు స్వయంగా నరేష్ ఈమెను దగ్గరుండి తీసుకెళ్లి మరి ఈమె చేత ఈ పరీక్ష రాయించారు.ఇకపోతే తాజాగా ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి ఫలితాలలో పవిత్ర లోకేష్ ఉత్తీర్ణత సాధించారు.అయితే వీరి ర్యాంక్స్ ఆధారంగా మెరిట్ ప్రకారం సీట్లను కేటాయిస్తావని యూనివర్సిటీ రిజిస్ట్రార్( University Registrar ) ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయిస్తున్నటువంటి తరుణంలో ఆ మెరిట్ జాబితాలో పవిత్ర లోకేష్ పేరు లేదని తెలుస్తుంది.దీంతో ఈమె పీహెచ్డీ చేయాలన్న కల ఈసారి నెరవేరదని తెలుస్తోంది.
పవిత్ర లోకేష్ రిజల్ట్ పై యూనివర్సిటీ రిజిస్ట్రార్ స్పందించారు.పవిత్ర లోకేష్ ఉత్తీర్ణత పొందింది కానీ సరైన ర్యాంక్ సాధించకపోవడంతో సీటు పొందలేదని అన్నారు. దీంతో ఈసారి ఈమెకు పీహెచ్డీ చేసే అవకాశం లేకుండా పోయిందని తెలిసింది.
అయితే మరోసారి ఈమెకు ఇలాంటి అవకాశం వస్తుందా రాదా అన్నది తెలియాల్సి ఉంది.ఇకపోతే ఈమె కెరియర్ పరంగా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
నరేష్ తో కలిసి ఈమె చేసిన మళ్లీ పెళ్లి( Malli Pelli Movie ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున సందడి చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy